శనిగ్రహం పేరు చెబితే చాలు.. చాలా మంది భయపడతారు. మన జీవితాలపై శని ప్రభావం అంత తీవ్రంగా ఉంటుంది. శనిదోష నివారణ కోసం రకరకాల పరిహారాలు పాటిస్తారు. అయితే ఈ సారి శనిత్రయోదశి రోజునే మహాశివరాత్రి వస్తుంది. ఈ క్రమంలో కొన్ని పరిహారాలు చేస్తే రాజయోగం ఉంటుంది అంటున్నారు జ్యోతిష్య శాస్త్ర నిపుణులు. ఆ వివరాలు..
మన జీవితాల్లో శని గ్రహం ప్రభావం ఎంత తీవ్రంగా, బాధకరంగా ఉంటుందో చెప్పాల్సిన పని లేదు. ఒక్కసారి మన గ్రహస్థితిపై శని ప్రభావం మొదలయితే జీవితంలో అన్ని సమస్యలే కనిపిస్తాయి. శనీశ్వరుడి అనుగ్రహం కోసం రకరకాల పరిహారాలు చేస్తారు. అయితే మిగితా రోజులతో పోలిస్తే.. ఈ సారి శనీశ్వరుడి అనుగ్రహం మరింత విరివిగా లభించే అవకాశం ఉంది అంటున్నారు పండితులు. అందుకు కారణం ఈ ఏడాది శివరాత్రి.. శనివారం నాడు.. అందునా శనిత్రయోదశి రోజున వస్తుంది. దాంతో ఈసారి శివరాత్రి విశిష్టమైనదిగా చెబుతున్నారు. ఇలా శనిత్రయోదశితో కలసి రావడం వల్ల అద్భుతమైన యోగం, బలాన్ని అందించే పర్వదినంగా ఈ శివరాత్రి నిలుస్తుంది అంటున్నారు పండితులు.
శనిత్రయోదశి, శివరాత్రి ఒక్కరోజే వస్తున్నాయి. మరి శని త్రయోదశి పూజ ముందు చేయాలా.. ఈశ్వరుడిని ముందుగా పూజించాలా అనే అనుమానాలు ఎక్కువగా ఉన్నాయి. అలానే శని దోషానికి గురైన రాశులవారు అనగా వృషభ, మిథున, కర్కాటక, సింహ, తుల, వృశ్చిక, మకర, కుంభ, మీనా రాశుల వారు.. ఎలాంటి పరిహారాలు చేస్తే మంచిది.. అలానే జీవితంలో వివిధ సమస్యలతో బాధ పడుతున్న వారు శనిత్రయోదశి, మహాశివరాత్రి కలిసి వస్తున్న ఈ పర్వదినం రోజున ఎలాంటి పరిహారాలు చేస్తే మంచిది.. శని త్రయోదశి పూజ చేసే వారు.. ఏ సమయంలో చేయాలి.. శనిదీపం ఎలా తయారు చేసుకోవాలి వంటి తదితర ప్రశ్నలకు ప్రముఖ జ్యోతిష్యులు బ్రహ్మశ్రీ నందిభట్ల శ్రీహరిశర్మ.. సుమన్‌టీవీకిచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో వెల్లడించారు. మరి ఆయన చెప్పిన పరిహారాలు ఏంటి.. శని దీపం ఎలా తయారు చేసుకోవాలి వంటి తదతర వివరాల కోసం ఈ వీడియో చూడండి.