తల్లిదండ్రులు దైవంతో సమానం అంటారు. వారు ఏం చేసినా పిల్లల కోసమే. అహర్నిశలూ పిల్లల కోసమే శ్రమిస్తారు. పిల్లలకి 3 పూటలా కడుపు నింపాలని ఒక పూట పస్తులుండే తల్లులు ఎందరో ఉన్నారు. పిల్లాడు కంటి నిండా హాయిగా నిద్రపోవాలని.. రాత్రి పూట కూడా కష్టపడే నాన్నలు ఎందరో. పిల్లల కోసం ఏదో ఒకటి చేయాలని తాపత్రయపడుతుంటారు. వారి అదృష్టం కొద్దీ కొంతమంది పిల్లలు వారి మాట విని.. బాగా చదివి స్థిరపడతారు. కానీ కొంతమంది దురదృష్టం కొద్దీ వారి పిల్లలు వారికి ఎదురు తిరుగుతారు. ఎంత చేసినా ఏమీ చేయలేదు అని అంటారు. చదవమంటే కోప్పడతారు. అడిగింది కొని పెట్టలేదని అలుగుతారు. ఎప్పుడూ ఏదో ఒక గొడవ పెట్టుకుంటారు. గుట్టుగా బతికే వారిని వీధిలో అందరి ముందు దోషుల్లా నిలబెడతారు. అయినా గానీ భరిస్తారు. ఎందుకంటే తల్లిదండ్రులు కదా.
సమాజంలో రకరకాల మనస్తత్వాల మనుషులు ఉంటారు. అలాంటి వారిలో ఈ యువకుడు ఒకడు. తనకి పేరు సరిగా పెట్టలేదని తల్లిదండ్రుల మీద ఏకంగా పోలీసులకే ఫిర్యాదు చేశాడు. వివరాల్లోకి వెళ్తే.. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండలంలోని కిషన్ నాయక్ తండాలో కర్ర సురేష్ అనే యువకుడు ఉన్నాడు. వయసు 23 సంవత్సరాలు. తనకి పేరు సరిగా పెట్టలేదని రోజూ తల్లిదండ్రులపై గొడవ పడేవాడు. ఏ పేరూ దొరకనట్టు నాకు సురేష్ అన్న పేరు పెట్టడం ఏమిటి? అని నిలదీసేవాడు. ఈ క్రమంలో రోజూ గొడవయ్యేది. అది తారా స్థాయికి చేరడంతో 100కు డయల్ చేసి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. “నా అమ్మ నాన్న నాకు సరైన పేరు పెట్టలేదు” అని కంప్లైంట్ చేశాడు. దీంతో పోలీసులు ఒక్కసారిగా కంగుతిన్నారు.
ఇలాంటి చిన్న చిన్న విషయాలకి ఫోన్ చేయకూడదని, పోలీసుల టైం వేస్ట్ చేయడం కరెక్ట్ కాదని, ఇలా చేయడం వల్ల అత్యవసర సమయంలో ఉన్న వారికి ఫోన్ లైన్ దొరక్క ప్రమాదం జరిగే అవకాశం ఉందని పోలీసులు హెచ్చరించారు. అయినా సరైన పేరు పెట్టలేదని పోలీసులకి ఫిర్యాదు చేయడం ఏంటి విచిత్రం కాకపోతే. ఏ పేరు అయితే ఏముంది? గొప్ప పనులు చేసి పేరు సంపాదించుకోవాలి గానీ పేరు మారిస్తే గొప్పోళ్ళు ఎలా అవుతారు. సురేష్ అన్న పేరు ఎంత చక్కగా ఉంది. మరి ఆ కుర్రోడికి ఆ పేరు ఎందుకు నచ్చలేదో. చూస్తుంటే భవిష్యత్తులో తల్లిదండ్రుల మీద.. “నన్ను అడక్కుండా పేరెందుకు పెట్టావ్” అని కేసు పెట్టేలా ఉన్నారే. ఆ మధ్య ఆడెవడో తన పర్మిషన్ లేకుండా కన్నందుకు తల్లిదండ్రుల మీద కోర్టులో కేసు వేశాడు. పిల్లలు మరీ వైలెంట్ గా ఉంటే సొసైటీ ఆఫ్ పేరెంట్స్ లోకం ఏమైపోవాలి?
అమ్మానాన్న సరైన పేరు పెట్టలేదని.. డయల్ 100కు ఫిర్యాదుhttps://t.co/dlCN5TsrW7#Complaint #Name #Parents #TeluguNews
— Sakshi (@sakshinews) October 10, 2022