ఫిల్మ్ డెస్క్- అక్కినేని నాగచైతన్య, అందాల భామ సాయి పల్లవి జండగా నటించిన తాజా సినిమా లవ్ స్టోరీ. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా పరవాలేదనిపించింది. లవ్ స్టోరీ సినిమా ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది. వెండితెర మీద మిస్ అయిన ప్రేక్షకులు ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహాలో లవ్ స్టోరీని ఎంజాయ్ చేస్తున్నారు. లవ్ స్టోరీని మరింతగా ప్రమోట్ చేసేందుకు ఆహా ప్రేక్షకులకు ఓ కాంటెస్ట్‌ను కండక్ట్ చేస్తోంది.
లవ్ స్టోరీ సినిమాలోని సారంగ దరియా సాంగ్ ఎంతలా పాపులర్ అయిందో అందరికి తెలుసు. ఆ పాట, అందులో హీరోయిన్ సాయి పల్లవి వేసిన స్టెప్పులు అదిరిపోయాయి. సారంగదరియా పాటను ప్రముఖ డ్యాన్స్ శేఖర్ మాస్టర్, ఆనీ మాస్టర్ కలిసి కొరియోగ్రఫీ చేసినట్టు తెలుస్తోంది. కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ కూతురు సాహితీ ఇప్పటికే ఓ ఈవెంట్‌లో సారంగదరియా పాటకు స్టెప్పులు వేసి అందరిని ఆకట్టుకుంది.
తాజాగా మరోసారి సారంగదరియా పాటకు డ్యాన్స్ చేసింది సాహితీ. ఈ పాటకు కొరియోగ్రఫీ చేయడం ఎంతో ఆనందంగా అనిపించిందని, డ్యాన్స్ దరియా చాలెంజ్ ప్రారంభించడం సంతోషంగా ఉందని శేఖర్ మాస్టర్ అన్నారు. మీరు కూడా మీ వర్షన్ లో డ్యాన్స్ దరియాను చేసి మాకు పంపించండి.. బాగా చేసిన వారిలోంచి ఐదు గురికి ఆహా నుంచి స్మార్ట్ ఫోన్లు లభిస్తాయి.. అని శేఖర్ మాస్టర్ చెప్పారు.
అంతే కాదు ఆహాలో లవ్ స్టోరీ సినిమాను చూడటం మాత్రం మరిచిపోకండని అని కూడా అన్నాడు శేఖర్ మాస్టర్. సారంగదరియా పాటపై ప్రతీ ఒక్కరూ ఇలా వీడియోలు చేయండి.. మీ ఫ్రెండ్స్ లో ముగ్గురిని నామినేట్ చేయండి అని అని చెప్పాడు. నవంబర్ 3న విన్నర్లను ప్రకటిస్తారట. మరింకెందుకు ఆలస్యం వెంటనే డ్యాన్స్ చేసి ఆహాకు పంపించి స్మార్ట్ ఫోన్ గెలుచుకొండి.