చెన్నై- తమిళ హీరో ధనుష్, ఐశ్వర్య రజనీకాంత్ విడిపోతున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. తామిద్దరం పరస్పర అవగాహనతో విడాకులు తీసుకుంటున్నట్లు ధనుష్, ఐశ్వర్య సోషల్ మీడియా వేధికగా ప్రకటించారు. ఇప్పుడు వీరిద్దరి డైవెర్స్ నిర్ణయం కోలీవుడ్ లో చర్చనీయాంశమవుతోంది.
హీరో ధనుష్, ఐశ్వర్య రజనీకాంత్ 2004లో ప్రేమ వివాహం చేసుకున్నారు. ఇదిగో ఇప్పుడు తమ 18 ఏళ్ల వైవాహిక జీవితానికి ముగింపు పలుకుతున్నట్లు చెప్పారు. ఇక భార్యా భర్తలుగా కలిసుండలేమంటూ ప్రకటించి అభిమానులకు షాక్ ఇచ్చారు. దీంతో ఎంతో అన్యోన్యంగా ఉండే ఈ కపుల్ విడాకులు తీసుకోవడం ఏంటని అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
వీరిద్దరి విడాకుల నిర్ణయం నేపధ్యంలో ధనుష్, ఐశ్వర్యలకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ బాగా చక్కర్లు కొడుతున్నాయి. ఈ క్రమంలో రజనీకాంత్ గతంలో తన అల్లుడు ధనుష్ గురించి గొప్పగా చెప్పిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
కాలా సినిమా ఆడియో ఫంక్షన్‌లో ధనుష్ గురించి రజనీకాంత్ మాట్లాడుతూ.. ధనుష్ చాలా మంచి వ్యక్తి. తల్లిదండ్రులను దేవుళ్లుగా భావిస్తాడు. భార్యను బాగా చూసుకుంటాడు. అతను మంచి తండ్రి, మంచి అల్లుడు, మంచి మనిషి, చాలా ప్రతిభ కలవాడు.. అంటూ రజనీ మాట్లాడిన ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. కూతురి విడాకుల నేపథ్యంలో స్టే స్రాంగ్ తలైవా అంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.
Apart From Trolls. Feeling sad For Rajini. Stay Strong 🙏 #Dhanush #DhanushDivorce #Divorce @dhanushkraja#Beast #Thalapathy66 @actorvijay pic.twitter.com/3brl7XYWNu
— பாண்டி💙❤💚 (@PandiyanKpm) January 18, 2022