రాధిక ఆప్టే సోషల్ మీడియాలో చేసే అందాల జాతర ఓ రేంజ్‌లో వైరల్ అవుతుంటుంది. బికినీలో రాధిక చేసే అందాల విందుకు అందరూ ఫిదా అవుతుంటారు. తాజాగా రాధికా ఆప్టే ఓ పోస్ట్ చేసింది. అందులో రాధికా బికినీలో దర్శనమిచ్చారు. కానీ తన ఒంటిని టవల్‌తో కవర్ చేసేశారు. ఈ క్రమంలో రాధిక చేసిన కామెంట్ వైరల్ అవుతోంది. ప్రతీ ఒక్కరూ జంతువే అని ఆమె చెప్పుకొచ్చారు.
తాను మాత్రం ఓ కప్పలా కనిపిస్తాను అని అన్నారు. మరీ మీరు ఏ జంతువు? అని తన ఫాలోవర్లను కూడా ప్రశ్నించింది .నావి కప్ప కళ్ల, కప్ప పెదవులు అంటూ తన శరీరభాగాల గురించి రాధిక చెప్పుకొచ్చారు. రాధిక ఆప్టే ఒక భారతీయ నటి. స్వతహాగా మరాఠీ నటి అయినప్పటికీ బాలీవుడ్, కోలీవుడ్, టాలీవుడ్ అనే తేడా లేకుండా అన్ని భాషల చిత్రాల్లో నటించారు. అంతటా మంచి నటిగా పేరు తెచ్చుకున్నారు.రజినీ, సూర్య, బాలయ్య వంటి స్టార్ హీరోల చిత్రాల్లో రాధికా ఆప్టే నటించారు.
రామ్ గోపాల్ వర్మ రక్తచరిత్ర సినిమాతో రాధికా ఆప్టేకు మంచి గుర్తింపు వచ్చింది. ఇక బాలయ్య నటించిన లెజెండ్ సినిమాలో కనిపించిన రాధికా ఆప్టే అందరినీ మెప్పించింది . టాలీవుడ్‌లో సెలెక్టెడ్ చిత్రాల్లో నటించారు. కోలీవుడ్‌లోనూ కొన్ని ప్రాజెక్ట్‌లనే చేశారు.రాధికా ఆప్టే సినిమాల ద్వారా కంటే కాంట్రవర్సీల వల్లే ఎక్కువగా ఫేమస్ అయ్యారు.ఆ మధ్య ఓ వెబ్ సిరీస్‌లో బోల్డ్ నటించడం, న్యూడ్ క్లిప్ బయటకు రావడంతో రాధికా ఆప్టే పేరు మార్మోగిపోయింది.
వెబ్ సిరీస్‌లు, అందులో బోల్డ్ పాత్రలు అంటే రాధికా ఆప్టే పేరు ఎక్కువగా వినిపిస్తుంది . రాధిక ఆప్టే సినిమాలతో సంబంధం లేని కుటుంబం. వీరి నాన్న గారు చారుదత్ ఆప్టే ఒక్క పుణేలోనే కాదు… మహారాష్ట్ర అంతటా పేరున్న నరాల వైద్యుడు. అమ్మ జయశ్రీ ఆప్టే పేరున్న మత్తు మందు వైద్యనిపుణురాలు. ఈమె, ఇద్దరు తమ్ముళ్ళు – మొత్తం ముగ్గురు సంతానం. ఈవిడ లండన్‌లో నృత్యం నేర్చుకుని రంగస్థలం మీద నటిస్తూ, అటు నుంచి మరాఠీ రంగానికీ, హిందీ సినీ రంగానికీ పరిచయమయ్యింది.
ఈవిడ సినిమాలు చూసి, దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సహాయకులెవరో చెప్పడంతో, ఆయన ‘రక్తచరిత్ర’ సినిమాకు ఆడిషనింగ్‌కు పిలిచారు.తర్వాత అందులో ఎంపికై రక్తచరిత్ర సినిమాలో నటించింది.సినిమాలలోకి రాకముందే 2002 నుండి రంగస్థల నటిగా కొనసాగుతున్నది. మరాఠీ, హిందీ, ఇంగ్లీషుల్లో ప్రయోగాత్మక నాటకాలలో నటించింది.
వీరి సొంత ఊరు పుణేలో చాలా నాటక సంస్థలతో కలసి పనిచేసింది. ముఖ్యంగా ‘ఆసక్త ‘ అనే రంగస్థల బృందంతో ఎక్కువగా పనిచేసింది. పుణేలోని ‘బాల గంధర్వ ‘ లాంటి ప్రసిద్ధ వేదికలపై ప్రదర్శనలిచ్చింది.రక్తచరిత్ర (2010)దోని (2012)లెజెండ్ (2014) లయన్ (2015)కబాలి (2016) బెంగాలీ అంతహీన్ చిత్రాలలోనే గాక ఎన్నో వెబ్ సిరీస్ లో నటిస్తూ ఓటీటీ ప్రేక్షకులను తన అభిమానులుగా సంపాదించుకుంది .