ఆర్. నారాయణ మూర్తి.. రెండు తెలుగు రాష్ట్రాలలో ఈ పేరుకి పరిచయం అవసరం లేదు. వ్యక్తిగతంగా తనకి ఎంత క్రేజ్ ఉన్నా.., తాను నమ్ముకున్న సిద్ధాంతం కోసం మాత్రమే సినిమాలు తీసే పీపుల్స్ స్టార్ ఆయన. అలాంటి ఆర్. నారాయణ మూర్తి.. తెలంగాణ సీఎం కేసీఆర్ పై తాజాగా సంచలన కామెంట్స్ చేశారు. ఆ వివరాల్లోకి వెళ్తే..
నారాయణ మూర్తి స్వీయ దర్శకత్వంలో నటించి నిర్మించిన చిత్రం ‘రైతన్న’. ఆగస్ట్ 14న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఆర్. నారాయణ మూర్తి రైతు పడుతున్న కష్టాలపై కాస్త భావోద్వేగంగా స్పందించాడు. “దేశంలో రైతు పరిస్థితి దీనంగా తాయారు అయ్యింది. గత ఎనిమిది నెలలుగా కేంద్ర ప్రభుత్వ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు ఆందోళన చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు.కొత్త వ్యవసాయ చట్టాలు రైతులకి వరాలు కాదు, శాపాలు అంటూ నారాయణమూర్తి స్పదించారు. ఇదే సమయంలో తెలంగాణ సీఎం కేసీఆర్ పై మాత్రం ప్రశంసల జల్లు కురిపించారు పీపుల్స్ స్టార్.
తెలంగాణ రైతులకి రైతు బంధు పథకం చాలా అద్భుతంగా ఉపయోగపడుతోంది. ఈ విషయంలో కేసీఆర్ పరిపాలన దేశానికే ఆదర్శం. ఆయన రైతులను ఆదుకునే విషయంలో నాయకులు అందరికీ దిక్సూచిగా నిలుస్తున్నారని కొనియడారు. ఆర్. నారాయణమూర్తి చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరి.. ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి.