ఫిల్మ్ డెస్క్- డేరింగ్ అండ్ డాషింగ్ టాలీవుడ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ సినిమాలు తీసే స్టైలే వేరు. సెంటిమెంట్ తో కూడిన మాస్త సినిమాలు తీయడంలో పూరి తనకు తానే సాటి. సంచలనాలకు మారుపేరైన రామ్ గోపాల్ వర్మ శిష్యుడిగా తెలుగు సినిమా ఇండస్ట్రీకి పరిచయమైన పూరి జగన్నాథ్, ఆ తరువాత తనదైన స్పెషల్ ఇమేజ్‌ను సొంతం చేసుకున్నాడు. పరిశ్రమలోని ఇతర దర్శకుల సినిమాల కంటే పూరి జగన్నాధ్ సినిమాలు కాస్త డిఫరెంట్ గా ఉంటాయని చెప్పక తప్పదు.
ప్రధానంగా పూరి సినిమాల్లో హీరోయిన్ ఓ రేంజ్ లో ఉంటుంది. అందుకే పూరితో సిినిమా అంటే హీరోలతో పడి సచ్చిపోతారు. ఇక ప్రేక్షకుల గురించి వేరే చెప్పక్కర్లేదు.. పూరి సినిమా అంటే ఫుల్ మీల్స్ చేసినట్లేనని ముద్దుగా కామెంట్ చేస్తుంటారంటేనే అర్ధం చేసుకోవచ్చు. విజయ్ దేవరకొండతో కలిసి లైగర్ అనే సినిమాను తెరకెక్కిస్తున్నారు పూరి జగన్నాధ్. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ ఓ కిక్ బాక్సర్ పాత్రలో కనిపించబోతున్నారు. ఇక పూరి తన తనయుడు ఆకాష్ పూరిని గతంలోనే వెండితెరకు పరిచయం చేశారు.
ఛైల్డ్ ఆర్టిస్ట్‌గా అతను పలు సినిమాల్లో నటించినా, హీరోగా చేసిన మెహబూబా అనే సినిమా ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయిందనే చెప్పాలి. ఇక ఇప్పుడు ఆకాష్ పూరి నటించిన రొమాంటిక్ అనే సినిమా విడుదలకు రేడీగా ఉంది. రెండేళ్ల క్రితం ప్రారంభమైన ఈ సినిమా కరోనా కారణంగా కాస్త ఆలస్యం అయ్యింది. ఈ యూత్ ఫుల్ రొమాంటిక్ ఎంటర్ టైనర్‌కి పూరి స్టోరీ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందించారు. పూరి జగన్నాధ్ శిష్యుడు అనిల్ పాదూరి దర్శకత్వం వహించారు.
ఈ సినిమా నుంచి తాజాగా లేటెస్ట్ అప్‌డేట్ వచ్చింది. రోమాంటిక్ సినిమా సెన్సార్ పూర్తి చేసుకోగా, యూ/ఏ సర్టిఫికేట్ ఇస్తున్నట్లు సెన్సార్ బోర్డు తెలిపింది. ఈ మేరకు ఓ రొమాంటిక్ పోస్టర్‌ని కూడా విడుదల చేసింది చిత్ర బృందం. ఈ సినిమా ద్వారా కేతికా శర్మ హీరోయిన్ గా పరిచయం అవుతోంది. అన్నట్లు పూరి జగన్నాథ్, హీరోయిన్ చార్మీ కౌర్ సినిమాకు నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. డ్రగ్స్ కేసులో ఈడీ విచారణను ఎదుర్కొంటున్న పూరి, ఛార్మీలు ఈ సినిమాపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు.
#𝐑𝐨𝐦𝐚𝐧𝐭𝐢𝐜 Censored 𝐔/𝐀 🤩
& Releasing Soon in Theatres🎬
🌟ing @ActorAkashPuri #KetikaSharma#Purijagannadh @Charmmeofficial @anilpaduri #SunilKashyap @meramyakrishnan #PCFilm pic.twitter.com/Uix5D4w1e4— Puri Connects (@PuriConnects) September 4, 2021