కేంద్ర ప్రభుత్వం.. దేశంలోని రైతులను ఆదుకోవడానికి పీఎం కిసాన్ స్కీమ్ మొదలు పెట్టిన విషయం తెలిసిందే. ఈ పథకం కింద అర్హులైన రైతులందరికీ ఏడాదికి 3 విడతల్లో.. రూ.2 వేల చొప్పున.. మొత్తం రూ.6,000 అకౌంట్ లో జమ అవుతాయి. ఇక తాజాగా కేంద్ర ప్రభుత్యం పీఎం కిసాన్ స్కీమ్ 2021 జాబితాను అప్‌డేట్ చేసింది. దీంతో.., ఇప్పుడు కొత్త జాబితాలో తమ పేరు ఉందో లేదో తెలుసుకోవడం రైతులకి పెద్ద కష్టం అయిపోయింది. ఇందుకే.. లిస్ట్ లో మీ పేరుని ఎలా చెక్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం.
పీఎం కిసాన్ స్కీమ్ లిస్ట్‌లో మీ పేరు ఉందో లేదో చూడటానికి ముందుగా pmkisan.gov.in సైట్‌కు వెళ్లాలి. ఈ వెబ్‌సైట్ ఓపెన్ చేసిన తరువాత.. మెనూ బార్ పై క్లిక్ చేయాలి. తరువాత ఫార్మర్స్ కార్నర్‌పై క్లిక్ చేయాలి. తర్వాత బెనిఫీషియరీ లిస్ట్‌పై క్లిక్ చేయాలి. ఇక్కడ రాష్ట్రం పేరు, డిస్ట్రిక్, బ్లాక్, విలేజ్ పేర్లు ఎంటర్ చేయాలి. తర్వాత గెట్ రిపోర్ట్‌పై క్లిక్ చేస్తే చాలు.. ఈ జాబితాలో మీ పేరు ఉందో, లేదో క్షణాల్లో తెలిసిపోతుంది. మరి.., ఇంకెందుకు ఆలస్యం? వెంటనే చెక్ చేసుకోండి.