విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణను అడ్డుకొనేందుకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కార్మిక సంఘాలను కలుపుకుని బహిరంగ సభతో ప్రజల ముందుకి వచ్చారు. విశాఖలోని కూర్మన్నపాలెంలో నిర్వహించిన సభలో పాల్గొన్న పవన్ విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని నినదించారు. విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ ఎవరో ఇస్తే రాలేదని, ఆరోజుల్లో 30 మంది తమ ప్రాణాలను కోల్పోయి సాధించుకుంది అని పవన్ గుర్తు చేశారు.

కొన్ని లక్షల మంది బతుకుతున్న ఇలాంటి ఫ్యాక్టరీని ప్రైవేటికరణ చేస్తుంటే వైసీపీ ప్రభుత్వం కామ్ గా చూస్తూ, ఉత్తరాలు రాసుకుంటుందని పవన్ ఎద్దేవా చేశారు. ఈ నేపథ్యంలో వారం రోజుల్లో ప్రభుత్వం నుండి స్పష్టమైన ప్రకటన చేయాలని జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు.ఈ విషయమై అఖిలపక్షం ఏర్పాటు చేయాలన్నారు.లేకపోతే విశాఖస్టీల్ ప్లాంట్ కార్మికుల పోరాటానికి తాము అండగా నిలుస్తామని జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ తెలియజేశారు. మరి.. ఈ విషయంలో పవన్ వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
