స్పెషల్ డెస్క్– ఈ విశ్వంలో మనిషికి మచ్చికైన ఎన్నో జంతువులు, పక్షులు ఉన్నాయి. కుక్కల నుంచి మొదలు ఏనుగులు, కోతులు, గుర్రాలు, కొన్ని రకాల పక్షులు మనిషితో మచ్చికగా మెలుగుతున్నాయి. ఐతే చాలా వరకు మచ్చిక చేసుకోవడానికి ఎంతో కొంత వాటికి ట్రైనింగ్ ఇవ్వాల్సి ఉంటుంది. కానీ ఓ రామచిలుక తనంతకు తానే స్కూల్ పిల్లలతో ఫ్రెండిషిప్ చేసి అందరిని ఆశ్చర్యపరుస్తోంది.
ప్రతి రోజు ఓ రామచిలుక ఏకంగా స్కూల్ కు వస్తోంది. అక్కడ చదువుతున్న విధ్యార్ధులతో స్నేహపూర్వకంగా మెదులుతోంది. అవును ఈ అరుదైన రామచిలుకను చాడాలంటే మాత్రం మధ్యప్రదేశ్ కు వెళ్లాల్సిందే. గ్వాలియర్ లో రామక్రుష్ణ విద్యా మందిర్ కు చెందిన విద్యార్థులతో ఈ రామచిలుక బంధం పెనవేసుకుంది. ఆ చిలుక ఫ్రెండ్ షిప్‌ను పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేస్తున్నారు.
అందమైన రామచిలుక స్నేహం తమకు చాలా సంతోషాన్నిస్తోందని వారంటున్నారు. ఫోటోలో చూస్తే అది చాలా స్పష్ణంగా కనిపిస్తోంది. పిల్లోడి నుదిటిపై చిలుక తన ముక్కుతో ప్రేమగా నిమురుతుంటే ఎంత ధ్రిల్ గా ఫీల్ అవుతున్నాడో కదా. గత ఐదారు నెలలుగా ఈ రామ చిలుక తమ స్కూల్ పిల్లలతో సన్నిహితంగా ఉంటోందని పాఠశాల సూపరింటెండెంట్ దీపక్ బేడీ చెప్పారు. పిల్లలు చేసే ప్రతి యాక్టివిటీని ఫాలో అవుతోందని తెలిపారు.
ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏటంటే.. ఈ రామ చిలుక స్కూల్ పిల్లలకు మంచి ఫ్రెండ్ అవ్వడమే కాదు.. వాళ్ల టైమ్ టేబుల్ ఫాలో అవుతోంది. పిల్లలు ఆటలాడే సమయంలో నేరుగా గ్రౌండ్ లోకి వచ్చి సందడి చేస్తోంది. స్కూల్ లో క్లాసులు జరుగుతుంటే ఏకంగా క్లాస్ రూంల్లోకి వచ్చేస్తోంది. ఇక స్కూల్ కు సెలవు ఉంటే పిల్లలను వెతుక్కుంటూ వాళ్లు ఉన్న వద్దకే వచ్చేస్తోందీ రామచిలుక. భలే ఉంది కదా.