బీహార్ సీఎం నితీశ్ కుమార్ తన స్వంత గ్రామంలోనే చేదు అనుభవం ఎదురైంది… కొంత మంది యువకులు ఆయనపై దాడి చేశారు. ఆదివారం సీఎం నితీశ్ కుమార్ ఆయన సొంత ఊరు అయిన భకిత్యాపూర్ కి వచ్చారు. స్వాతంత్ర్య ఉద్యమంలో పోరాడిన యోధుడు షిల్ భద్రయాజీ విగ్రహన్ని ఆవిష్కరించేందుకు విచ్చేశారు. అయితే నితీష్ విగ్రహం ముందు నివాళీ అర్పిస్తున్న సమయంలో ఓ యువకుడు భద్రతా సిబ్బందిని దాటుకొని ఆయనపై దాడి చేశాడు. వెంటనే అప్రమత్తమైన సిబ్బందిని ఆ యువకుడిని అదుపులోకి తీసుకున్నారు.
ఆ యువకుడికి మతిస్థిమితం సరిగా లేదని.. పోలీసులు తెలిపారు. ఒక సీఎం కే సరైన భద్రత కల్పించలేని పరిస్థితిలో ఉన్నట్టు భద్రత వ్యవస్థలో లోపాన్ని ఎత్తిచూపింది. దాడి ఘటన సీసీ కెమేరాల్లో రికార్డయింది. కాగా, సీఎం భద్రతపై జేడీయూ ఆందోళన వ్యక్తంచేసింది. దీనిపై జేడీయూ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది.. ఒకవేళ దాడి చేసిన వ్యక్తి చేతిలో మారణాయుధం ఉంటే పరిస్థితి ఏంటని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై పూర్తిస్థాయి దర్యాప్తు జరిపించాలని ఆ పార్టీ నేతలు డిమాండ్ చేశారు.
Bihar | A youth tried to attack CM Nitish Kumar during a program in Bakhtiarpur. The accused was later detained by the Police.
(Viral video) pic.twitter.com/FoTMR3Xq8o
— ANI (@ANI) March 27, 2022