జీవితాన్ని ఎంతో హాయిగా, సంతోషంగా గడపపాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు. అయితే సంతోషం అంటే మనం మాత్రమే బాగుండటం కాదు.. మన కుటుంబ సభ్యులు కూడా బాగుండాలి. ఇంట్లో ఎవరికి సమస్య వచ్చినా అది మనకు కూడా సమస్యే. అందుకే తల్లిదండ్రులు తమ ఆరోగ్యాలు ఎలా ఉన్నా.. పిల్లల ఆరోగ్యాలు బాగా లేకుంటే ఆందోళన చెందుతారు. అయితే కొందరి పిల్లలకు పుట్టుకతోనే ఆరోగ్య సమస్యలు వచ్చి ఇంటికి, వీల్ చైర్ కే పరిమితం అవుతుంటారు. వారిని చూస్తూ తల్లిదండ్రులు తీవ్ర వేదనకు గురవుతారు. మిగతా పిల్లల మాదిరి తమ బిడ్డకు పెళ్లి చేయాలని భావిస్తారు. అది నేరవేరకపోవడంతో తమలో తామే కుంగిపోతుంటారు. కానీ ఓ తండ్రి మాత్రం అందరికి భిన్నంగా ఓ వినుత్న కార్యక్రమంలో చేశాడు. నడవలేని స్థితిలో ఉన్న తన కూతురికి భగవంతుడితో పెళ్లి చేశాడు. సంప్రదాయ బద్దంగా అన్ని కార్యక్రమాలు చేసి దేవుడికి తన కుమార్తెను ఇచ్చి వివాహం జరిపించాడు. ప్రస్తుతం ఈ వివాహం టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది.ఈ వివాహం వెనుక ఓ తండ్రి ఆవేదన ఉంది. ఆ తండ్రి వేదన కథ ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..
మధ్యప్రదేశ్ రాష్ట్రం గ్వాలియర్ చెందిన వ్యాపారవేత్త శిశుపాల్ రాథోడ్ కి సోనాల్(26) అనే కుమార్తె ఉంది. ఆమె నయంకాని నాడీ సంబంధీత రుగ్మతతో 21 ఏళ్లుగా మంచానికే పరిమతమై ఉంది. సోనాల్ వచ్చిన వ్యాధిని నయం చేసేందుకు ఎన్ని ఆస్పత్రులు తిరిగిన ఫలితం లేకపోయింది. తన కూతుర్ని ఎంతో అల్లారు ముద్దుగా చూసుకున్న శిశుపాల్, మిగిలిన ఆడ పిల్లల మాదిరి..తన కుమార్తెకు పెళ్లి చేసి అత్తగారింటికి పంపిచాలని కోరుకున్నాడు. అయితే, అందరి ఆడ పిల్లలాగే సోనాల్ కు పెళ్లి చేసుకోవాలని ఆశ ఉన్నా దివ్యాంగురాలు కావడంతో ఎవరూ ముందుకు రాలేదు. దీంతో కుమార్తె పరిస్థితి చూసి మనోవేదన చెందిన శిశుపాల్ రాథోడ్.. ఓ నిర్ణయం తీసుకున్నాడు.
తన కుమార్తెకు దేవుడితో వివాహం చేయాలని నిర్ణయించారు. తన బంధువులందరికి ఫోన్లు చేసి తన కుమార్తె పెళ్లి ఉందని ఆహ్వానించాడు. దేవుడితో వివాహం ఏంటని వారంతా ఆశ్చర్యపోయారు. ఆ వివాహాన్ని శివపాల్ అత్యంత వైభవంగా నిర్వహించాడు. అదిరిపోయే వివిధ రకాల వంటలతో వచ్చిన అతిథిలను మైమరిపించాడు. అంతేకాక విద్యుత్ కాంతులతో పెళ్లి కుమార్తె ఊరేగింపును ఘనంగా జరిపించాడు. ఇక అసలు విషయం ఏమిటంటే… శ్రీ కృష్ణుని వేషాధారణలో ఉన్న ఓ యువతికి.. శిశుపాల్ తన కుమార్తెను ఇచ్చి వివాహం జరిపించాడు. ఇద్దరు పూలదండలు మార్చుకోగా బంధుమిత్రులు ఆశీర్వదించారు.
ఈ పెళ్లిని శ్రీకృష్ణుడి ఆలయంలో నిర్వహించారు. తన మిగిలిన కుమార్తెల మాదిరిగానే అన్ని ఆచారాలతో సోనాలకి పెళ్లి చేశానని, సోనాలి సోదరుడు కూడా సంతోషంగా ఉన్నాడని శిశుపాల్ తెలిపారు. ప్రస్తుతం ఈ వివాహం స్థానికంగా చర్చనీయాంశమవుతోంది. శ్రీకృష్ణుడే తమ కుమార్తె ఆరోగ్యం చూసుకుంటాడని సోనాల్ తల్లిదండ్రులు ఆశగా ఉన్నారు. ప్రస్తుతం ఈ పెళ్లి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Man fulfills terminally sick daughter’s wish, marries her to #LordKrishna in #Gwalior with fanfare. During the #marriage all #rituals were followed, watchhttps://t.co/SIICIKukNr#MadhyaPradesh #Viral #News #Krishna pic.twitter.com/cl4CqPfaax
— Free Press Journal (@fpjindia) November 10, 2022