పెళ్లైన మహిళ పెళ్లికాని కుర్రాడితో వివాహేతర సంబంధం కొనసాగించింది. ఈ విషయం తెలుసుకున్న గ్రామస్తులు.. వారిని ఓ చోట రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. అంతేకాకుండా వారిని తాళ్లతో కట్టేసి నడి రోడ్డుపై దారుణంగా చితకబాదారు.
ఉత్తర్ ప్రదేశ్ లో దారుణం చోటు చేసుకుంది. పెళ్లైన మహిళ స్థానిక యువకుడితో ప్రేమాయణం కొనసాగించిందని గ్రామస్తులు ఇద్దరిని తాళ్లతో కట్టేసి నడి రోడ్డుపై చితకబాదారు. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైంది. అసలేం జరిగిందంటే? ఉత్తర్ ప్రదేశ్ ఉన్నావ్ పరిధిలోని బరస్ గవార్ ప్రాంతం. ఇదే గ్రామానికి చెందిన ఓ వ్యక్తితో మహిళకు వివాహం అయింది. పెళ్లైన కొంత కాలం పాటు ఆ వివాహిత భర్తతో బాగానే సంసారం చేసింది. దీంతో ఈ దంపతుల దాంపత్య జీవితం సాఫీగానే సాగుతూ వచ్చింది.
అయితే ఈ క్రమంలోనే ఆ మహిళ తన బుద్దిని వక్రమార్గంలోకి నెట్టేసి స్థానికంగా ఉండే ఓ యువకుడితో ప్రేమాయణం అంటూ తిరిగింది. ఆ యువకుడి సైతం ఆ వివాహితతో తిరిగాడు. అలా వీరి చీకటి సంసారం కొన్నాళ్ల పాటు బాగానే నడిచింది. ఇకపోతే ఇటీవల వీరిద్దరూ ఓ చోట కనిపించగా గ్రామస్తులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. అనంతరం ఇద్దరినీ తాళ్లతో కట్టేశారు. ఇక గ్రామస్తులు అంతా చేరి నడి రోడ్డుపై వారిని కిందే పడేసి రక్తం వచ్చేలా దారుణంగా చితకబాదారు. అయితే వీరిని కాపాడే ప్రయత్నం ఎవరూ చేయకపోగా వీడియోలు తీసుకున్నారు.
ఇకపోతే గ్రామస్తుల దాడిలో వీళ్లిద్దరూ తీవ్రంగా గాయపడి ఏడుస్తు ఉండగా కొందరు వ్యక్తులు స్పందించి వారిని వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో కాస్త వైరల్ గా మారుతున్నాయి. ఈ వీడియోలు చూసిన కొంతమంది నెటిజన్స్.. ప్రేమికులకు మద్దతు కూడగడితే, మరి కొంతమంది గ్రామస్తులకు అనుకూలంగా కామెంట్స్ చేస్తున్నారు. ఇదే ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది. వివాహేతర సంబంధం కారణంగా వీరిని కట్టేసి కొట్టడం సమంజసమేనని మీరు భావిస్తున్నారా? మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.
— Hardin (@hardintessa143) March 10, 2023