పవిత్రమైన వసంత పంచమి పర్వదినం రోజున.. మహిళల చేత అశ్లీల నృత్యాలు చేయించిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. ఆడవాళ్లు అర్ధనగ్నంగా డ్యాన్సులు చేస్తూ చేతుల్లో మారణాయుధాలను చూపిస్తూ ఒళ్లు మరిచిపోయి చిందులేశారు. వారి చుట్టూ చేరిన జనాలు.. డ్యాన్సర్ల మీదకు డబ్బు చల్లుతూ.. వారి బుగ్గలను, శరీర బాగాలను తాకుతూ అసభ్యంగా ప్రవర్తించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇంతటి నీచమైన కార్యక్రమం బిహార్ లో చోటు చేసుకుంది.
బిహార్, సివాన్ జిల్లాలోని బీబీనగర్ పోలీస్ స్టేషన్ సమీపంలో రికార్డింగ్ డ్యాన్స్ తరహాలో అశ్లీల నృత్యప్రదర్శనలు జరగిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. సందర్భం ఏమిటో తెలియదు కానీ..ఇద్దరు మహిళలు మగాళ్ల మధ్య.. అర్థనగ్న ప్రదర్శన చేస్తూ.. వెకిలి డ్యాన్స్ లు చేశారు. ఇందులో ఒక మహిళ చేతిలో తుపాకి కూడా ఉంది. దాన్ని చూపిస్తూ అక్కడ ప్లే చేస్తున్న డీజే పాటలకు డ్యాన్స్ చేస్తూ అందర్ని ఆనందింపజేసింది. చూడటానికి ఏదో ఊరి చివర గెస్ట్‌హౌస్‌లో ఇదంతా నిర్వహించినట్లుగా కనిపిస్తోంది. అయితే ఈ అశ్లీల నృత్య కార్యక్రమం వసంత పంచమి రోజున జరగడం గమనార్హం. సివాన్‌లో ఉండే కొందరు పెద్ద మనుషులే ఈ తరహా వినోద కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లుగా వీడియోని చూస్తే అర్ధమవుతోంది.
ఇది కూడా చదవండి : పడక సుఖం కోసం ఐదు మంది ప్రాణాలు తీశారు!
డ్యాన్స్ చేస్తున్న మహిళల చుట్టూ కొందరు మగాళ్లు చేతిలో కరెన్సీ నోట్ల కట్టల్ని పట్టుకొని వాటిని వారిపై విసిరారు. మరి కొందరు ఆ నోట్లను డ్యాన్సర్ల పెదాలకు తగిలిస్తూ ఆనందం పొందారు. ఇంకొందరైతే ఏకంగా కరెన్సీ నోట్లను మహిళల జాకెట్‌లో పెట్టేందుకు ప్రయత్నించారు. ఈ అసభ్యకరమైన ప్రదర్శనను అక్కడే ఉన్న ఓ వ్యక్తి తన ఫోన్ లో రికార్డు చేస్తూ.. అమితానందాన్ని పొందుతున్నాడు. పోలీస్ స్టేషన్‌కి కూతవేటు దూరంలో.. ఆయుధాలు పట్టుకొని మహిళలతో అసభ్యకర నృత్యాలు చేయిస్తుంటే పోలీసులు పట్టించుకోకపోవడం ఏమిటనే విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ కావడంతో స్థానిక పోలీసులు ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన వారిని వెతికే పనిలో పడ్డారు. డ్యాన్సర్ల చేతికి తుపాకులు ఎలా వచ్చాయి అనే విషయాలను ఆరా తీస్తున్నారు.