భారత్-పాకిస్తాన్ ల మధ్య నిత్యం వివాదాన్ని, ఉద్రిక్తతలను రాజేసే ప్రాంతం పాక్ ఆక్రమిత కశ్మీర్ అదే పీఓకే. భారత్ కు స్వాతంత్య్రం వచ్చిన ఏడాది నుంచే ఈ ప్రాంతం వివాదాస్పదంగా మారింది. 1947, అక్టోబర్ 29 నుంచి ఈ ప్రాంతం పాకిస్తాన్ చట్టవిరుద్ధమైన నియంత్రణలో ఉంది. ఆ సమయంలో పాకిస్తాన్ మద్దతు ఉన్న గిరిజన లష్కర్లు జమ్ము కశ్మీర్ రాష్ట్రాన్ని ఆక్రమించడంతో.. దాని పాలకుడు భారత్ ఆశ్రయం కోరారు. అప్పటి నుంచి ఈ వివాదం కొనసాగుతూనే ఉంది.
ప్రస్తుతం పీఓకే పాక్ అక్రమణలో ఉండగా.. జమ్మూ కశ్మీర్ రాష్ట్రం భారత్ లో భాగంగా ఉంది. ఈ నేపథ్యంలో తాజాగా పీఓకే పై కేంద్ర మంత్రి ఒకరు సంచలన వ్యాఖ్యలు చేశారు. అతి త్వరలో పీఓకేని భారత్ ఆక్రమిస్తుందని తెలిపారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నాయి.
బీజేపీ ఎంపీ కపిల్ పాటిల్ మహారాష్ట్ర పర్యటనలోఘీ వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘చూస్తూ ఉండండి.. 2024 నాటికి చాలా పెద్ద పరిణామం చోటు చేసుకోబోతుంది. పాక్ ఆక్రమిత కశ్మీర్ భారత్ లో భాగం కాబోతుంది అని చెప్పడానికి ఎలాంటి అనుమానం లేదు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో ఇది సాధ్యం కానుంది. మోదీ, అమిత్ షా దేశ రక్షణ కోసం కట్టుబడి ఉన్నారు. వారిద్దరు ఇప్పటికే దేశం కోసం ఎన్నో సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకున్నారు. భవిష్యత్తులో మరిన్ని తీసుకుంటారు. వాటిలో ఒకటి పీఓకే ఆక్రమణ. 2024 నాటికి భారత్ పీఓకేని ఆక్రమిస్తుంది’’ అని తెలిపారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నాయి. కేంద్ర మంత్రి వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.