దేశంలో కొంతకాలంగా మోటార్ వాహనాల కొనుగోలు ఎక్కువగా పెరిగిపోయింది. ఇంట్లో ఎన్ని కార్లు ఉన్నా.. బైక్ పై ఉండే మోజు వేరు. సెలబ్రెటీల నుంచి సామాన్యుల వరకు బైక్ పై రైడ్ చేయడం అంటే ఎంతో ఇష్టం. వారి స్థోమతను బట్టి బైక్ లు ఖరీదు చేస్తుంటారు. కొంతమందికి బైక్ కొనుగోలు చేయాలనేది ఒక డ్రీమ్ గా ఉంటుంది. అందుకోసం కొంత మంది నాణేలు కూడబెట్టుకొని షోరూం కి వెళ్లి తమకు నచ్చిన బైక్ ని కొనుగోలు చేస్తుంటారు. అంతవరకు బాగానే ఉన్నా.. ఆ నాణేలు లెక్కబెట్టలేక షోరూం సిబ్బంది పడే అవస్థలు అన్నీ ఇన్నీ కావు. ఇలాంటి ఘటన ఒకటి ఉత్తరాఖాండ్ లో జరిగింది.
రుద్రపూర్ కి చెందిన ఓ యువకుడు తాను బైక్ కొనుగోలు చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాడు. ఇందుకోసం కోసం కొంత డబ్బును తీసుకు వెళ్లాడు. అందరిలా తాను కొనుగోలు చేస్తే వెరైటీ ఎముంటుందని అనుకున్నాడో ఏమో కానీ.. క్రేజీగా ఆలోచించాడు. రుద్రాపూర్‌లో ఉన్న ఓ టీవీ ఎస్ జూపిటర్ స్కూటర్ షోరూమ్ కి వెళ్లాడు. తన వద్ద దాచుకున్న రూ.50 లు కౌంటర్ లో ఉంచారు. అంతే షోరూం సిబ్బంది ఒక్కసారిగా అవాక్కయ్యారు.. ఎందుకంటే సదరు యువకుడు తీసుకు వచ్చిన 50 వేలు మొత్తం 10 రూపాయల కాయిన్స్. ఇక ఆ యువకుడు ఇచ్చిన పది రూపాయల కాయిన్స్ ని షోరూం సిబ్బందికి చెందిన ఓ వ్యక్తి టేబుల్ పై లెక్కబెట్టడానికి నానా కష్టాలు పడ్డాడు.
పది రూపాయల కాయిన్స్ లెక్కిస్తున్న సమయంలో ఓ వ్యక్తి వీడియో తీశాడు. మొత్తానికి పది రూపాయల నాణాలు లెక్కబెట్టిన తర్వాత ఒకే చెప్పడంతో ఆ యువకుడికి స్కూటీ ఇచ్చారు. ఈ సందర్భంగా షోరూమ్ యజమాని మాట్లాడుతూ.. బైక్ కొనుగోలు చేయడం ఎంతో మందికి ఒక కల.. ఆ కల నెరవేర్చుకోవడానికి ఎంతో ప్రయత్నిస్తుంటారు. ఆ యువకుడు ఎంతో కాలంగా తన వద్ద ఉన్న 10 రూపాయల కాయిన్స్ కూడబెట్టడానికి ఎంతో కష్టపడి ఉంటాడు.. అతని కష్టాన్ని తాము గౌరవిస్తున్నామని అన్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.
Customer paid 50k in coins to buy TVS Jupiter scooter at TVS showroom in Rudrapur. pic.twitter.com/lzkOMCABP8
— Lakshya Rana (@LakshyaRana6) October 24, 2022