గత కొన్ని రోజులుగా మహరాష్ట్రలోకొనసాగుతున్న ఉత్కంఠకు తెర పడింది. మొత్తానికి మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే తన పదవికి రాజీనామా చేశారు. ఈ రాజీనామా ఆయన బల పరీక్షకు ముందే చేశారు. బుధవారం రాత్రి సోషల్ మాద్యమం ద్వారా రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ.. తన పదవికి రాజీనామా చేస్తున్నట్లుగా ప్రకటించారు.
తన పదవికి రాజీనామా ప్రకటించిన తర్వాత థాకరే పలు కీలక అంశాలను ప్రస్తావించారు. తాను సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును ఎంతో గౌరవిస్తున్నానని.. గత కొంత కాలంగా తనకు సహకరించిన సోనియా గాంధీ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్‌కు కృతజ్ఞతలు చెప్పారు. తమ ప్రభుత్వానికి కొంత మంది దిష్టి తగిలిందని అందుకే ఇలా జరిగిందని అన్నారు. తనను సొంతవారే దెబ్బతీశారని.. కూర్చొని మాట్లాడి ఉంటే సమస్యలు పరిష్కరించుకునేవాళ్లమని ఆవేదన వ్యక్తంచేశారు.
తాను రెబల్ ఎమ్మెల్యేలకు ఎంతగా చెప్పినా వినిపించుకోలేదని.. అందరూ తనను ఇంతగా మోసం చేస్తారని అనుకోలేదని ఉద్వేగానికి గురయ్యారు. గతంలో కర్ణాటక సీఎం పదవికి యడ్యూరప్ప సైతం ఇదే తరహాలో బలనిరూపణకు కాసేపటి ముందు రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. సీఎం పదవితోపాటు ఎమ్మెల్సీ పదవికి సైతం థాక్రే రాజీనామా చేశారు. థాకరే రాజీనామా చేయడంతో రేపు మహారాష్ట్ర అసెంబ్లీలో బల పరీక్షే అవసరం లేకుండా పోయింది. ఉద్దవ్ థాక్రే రాజీనామా ప్రకటనతో బీజేపీ నేతలు స్వీట్లు పంచుకున్నారు.
I had come (to power) in an unexpected manner and I am going out in a similar fashion. I am not going away forever, I will be here, and I will once again sit in Shiv Sena Bhawan. I will gather all my people. I am resigning as the CM & as an MLC: Shiv Sena leader Uddhav Thackeray pic.twitter.com/dkMOtManv3
— ANI (@ANI) June 29, 2022