గత కొన్ని రోజులుగా మహరాష్ట్రలోకొనసాగుతున్న ఉత్కంఠకు తెర పడింది. మొత్తానికి మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే తన పదవికి రాజీనామా చేశారు. ఈ రాజీనామా ఆయన బల పరీక్షకు ముందే చేశారు. బుధవారం రాత్రి సోషల్ మాద్యమం ద్వారా రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ.. తన పదవికి రాజీనామా చేస్తున్నట్లుగా ప్రకటించారు. తన పదవికి రాజీనామా ప్రకటించిన తర్వాత థాకరే పలు కీలక అంశాలను ప్రస్తావించారు. తాను సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును ఎంతో గౌరవిస్తున్నానని.. […]
హైదరాబాద్ : దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకూ ప్రజల ఆరోగ్యం కోసం అమలు చేయని సరికొత్త పథకాన్ని ఢిల్లీ అమలు చేస్తోంది. అక్కడి ప్రజల కోసం ఉచితంగా వైద్య పరీక్షలు చేయించుకునే సౌకర్యాన్ని కల్పిస్తోంది ఆ ప్రభుత్వం. ప్రయివేట్ డయాగ్నస్టిక్ సెంటర్ల ద్వారా రోగులకు 450 రకాల పరీక్షలు ఉచితంగా అందించేందుకు అక్కడి సర్కారు ఔట్ సోర్సింగ్, ప్రైవేట్ ల్యాబ్‌లను ఏర్పాటు చేసింది. మొహల్లా క్లినిక్‌లు, ఆసుపత్రులు, డిస్పెన్సరీలు, పాలీక్లినిక్‌లలో ఇప్పటికే అనేక పరీక్షలు […]
గోవాలో జరిగిన ఇద్దరు మైనర్ బాలికలపై గ్యాంగ్ రేప్ మరియు ఇద్దరు మైనర్ బాలురపై దాడి కేసు విషయమై అసెంబ్లీ వేదికగా గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. గతవారం గోవాలో జరిగిన ఇద్దరు మైనర్ బాలికలపై గ్యాంగ్ రేప్ మరియు ఇద్దరు మైనర్ బాలురపై దాడి కేసు విషయమై అసెంబ్లీ వేదికగా గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. హోం మంత్రిత్వ శాఖ కూడా తన వద్దే ఉంచుకున్న ప్రమోద్ […]
ఏడాది కాలంగా సాగుతోన్న పీవీ నర్సింహారావు శత జయంతి ఉత్సవాలు ముగిశాయి. హైదరాబాద్‌లోని నెక్లెస్ రోడ్‌లో పీవీ మార్గ్‌లో ఉన్న జ్ఞాన భూమిలో శతజయంతి ముగింపు ఉత్సవాలను నిర్వహించారు. వేడుకల్లో భాగంగా 26 అడుగుల పీవీ కాంస్య విగ్రహాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్, గవర్నర్ తమిళ సై ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నెక్లెస్‌రోడ్‌ను పీవీ మార్గ్‌గా ప్రకటించారు. అంతేకాకుండా ఈ సందర్భంగా పీవీ నర్సింహారావు రచనలతో రూపొందించిన పుస్తకాలను విడుదల చేశారు. ఎక్కడ ఏ పదవి లభించినా అక్కడ […]
ప్రజల మధ్య చారిత్రక, రాజకీయ, ఆర్ధిక, సాంస్కృతిక అసమానతలు, విభేదాలు, వివిధ ప్రాంతాల మధ్య నెలకొన్న భావోద్వేగాలు ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమానికి ఊపిరిలూదుతూ వచ్చాయి. తొలిదశ ఉద్యమంలో జరిగిన తప్పులను బేరీజు వేసుకుంటూ మలి దశ ఉద్యమ జెండా ఎత్తారు కేసీఆర్. తెలంగాణ ప్రజల ఆకాంక్ష నెరవేరిన రోజు. ప్రజల స్వప్నం సాకారమైన దినం. 58 ఏళ్ల పాటు వివక్షకు గురై సొంత రాష్ట్రం సాధించుకొని నీళ్లు, నిధులు, నియమాకాల ట్యాగ్‌లైన్‌తో దేశంలో 29వ రాష్ట్రంగా […]
సీఎం వైఎస్ జగన్ రెండేళ్ల పాలన సంబరాలు ఒక రోజు ముందుగానే మొదలయ్యాయి. ట్విట్టర్‌లో ‘2 ఇయర్స్ ఫర్ వైఎస్ జగన్ అనే నేను’ హ్యాష్‌ట్యాగ్ దేశవ్యాప్తంగా ట్రెండింగ్‌లో నిలిచింది. ఈ ట్రెండింగ్ ఇదే స్థాయిలో కొనసాగుతోంది. ఈ హ్యాష్‌ట్యాగ్‌ను ట్విట్టర్‌లో క్రియేట్ చేసిన రెండున్నర గంటల్లోనే లక్ష మందికిపైగా ట్వీట్లు చేయడం విశేషం. దాదాపు అన్ని సోషల్ మీడియాలో జై జగన్ అనే కనిపిస్తోంది. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో 151 ఎమ్మెల్యేలను గెలిపించుకుని చరిత్ర సృష్టించిన […]
చత్తీస్‌గడ్‌లో లాక్‌డౌన్ సమయంలో మోటారు సైకిలుపై బయటకు వచ్చిన యువకునిపై దురుసుగా ప్రవర్తించడమే కాక, చేయిచేసుకుని అతని సెల్‌ఫోన్‌ను ధ్వంసం చేసిన సూరజ్‌పూర్ జిల్లా కలెక్టర్ రణవీర్ శర్మ తన ఉద్యోగం కోల్పోవలసి వచ్చింది. సూరజ్‌పూర్‌లో మందులను కొనుక్కోడానికి శనివారం బయటకు వచ్చిన అమన్ మిట్టల్ ను కలెక్టర్ రణవీర్ తోపాటు పోలీసులు అడ్డుకున్నారు. కలెక్టర్‌కు మిట్టల్ ఏదో కాగితం తీసి చూపించి, మొబైల్ ఫోన్‌లో వివరాలు కూడా చూపించాడు. ఛత్తీస్‌గఢ్‌లో కొనసాగుతున్న లాక్‌డౌన్ మధ్య మందులు […]
కంగనా రనౌత్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర లేదు. ఆమె ఓ ఫైర్ బ్రాండ్ అంతేకాదు మంచి నటిగా కూడా పేరు సంపాదించుకుంది. ఆ మధ్య ప్రకటించిన 67వ జాతీయ అవార్డుల్లో కంగనాకు పంగా, మణికర్ణిక సినిమాల్లో తన నటనకు బెస్ట్ యాక్టర్‌గా జాతీయ పురస్కారం లభించింది. కంగనా రనౌత్ తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి పురచ్చి తలైవి జయలలిత జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న ‘తలైవి’ సినిమాలో జయలలిత పాత్రలో కంగనా నటిస్తోంది. కంగనా ఎప్పుడూ ఏదో […]
కరోనా విజృంభణ,లాక్ డౌన్ నేపథ్యంలో ఉపాధి కోల్పోయి ఇబ్బందులెదుర్కొంటున్న పేదలకు ఆర్థిక తోడ్పాటు అందించాలని ఢిల్లీ ప్రభుత్వం నిర్ణయించింది. ఢిల్లీలోని ఆటోవాలాలు, ట్యాక్సీ వాలాలకు రూ.5000 చొప్పున వారి వారి అకౌంట్లలో వేయనున్నట్లు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మంగళవారం ప్రకటించారు. ఆటో, టాక్సీ డ్రైవర్లకు 5 వేలరూపాయల ఆర్ధిక సహాయం ఇవ్వాలని నిర్ణయించింది. సాధ్యమైనంత త్వరగా ఈ సాయాన్ని అందజేస్తామని ఆయన మంగళవారం ప్రకటించారు. దీనివల్ల వారు కొంతవరకైనా తమ ఆర్ధిక నష్టాల నుంచి బయటపడతారని […]
ఏపీలో టెన్త్, ఇంటర్ విద్యార్థుల కోసం ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ పోరాటం చేస్తున్నారు. ప్రభుత్వ తీరును నిరసిస్తూ పాల్ నిరసన దీక్షకు దిగారు. సీఎం జగన్ పరీక్షలు రద్దు చేస్తానని చేప్పే వరకూ దీక్ష కొనసాగిస్తానని ఆయన తెలిపారు. 35 లక్షల మంది విద్యార్థులకు న్యాయం జరిగే వరకు దీక్ష కొనసాగిస్తాను అన్నారు. టెన్త్, ఇంటర్ పరీక్షలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. దీక్ష మాత్రమే కాదు టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా వేయాలని […]