ఈ మద్య కాలంలో సోషల్ మీడియా పుణ్యమా అంటూ ప్రపంచంలో ఎక్కడ ఏ వింత సంఘటన జరిగినా క్షణాల్లో నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. అలాంటి వాటిల్లో కొన్ని బాధకలిగించేవి ఉంటే.. మరికొన్ని కుడుపుబ్బా నవ్వించేలా ఉంటున్నాయి. తాజాగా ఓ లారీకి చెందిన వీడియో తెగ వైరల్ అవుతోంది.
సాధారణంగా ఏదైనా వాహనాలకు ప్రమాదం జరిగితే అక్కడే స్థంభించిపోతాయి.. కానీ రోడ్డు ప్రమాదానికి గురై లారీ రెండు ముక్కలైనప్పటికీ.. లారీ ఇంజన్ భాగం ఆగకుండా ముందుకు వెళ్లిపోతుంది. ఇద్దరు వ్యక్తులు మూల మలుపు నుంచి నడుచుకుంటూ వస్తున్నారు. ఆ సమయంలో వారి వెనకవైపు నుంచి భారీ లోడ్‌తో వస్తున్న లారీ మూలమలుపు వద్ద టర్న్ అయ్యింది. ఒక్కసారే అదుపు తప్పి కింద పడిపోయింది.
అయితే లారీ పైభాగం మొత్తం పడిపోయినా.. చక్రాలతో ఉన్న కింది భాగం రోడ్డుపై పరుగులు పెడుతూ దూసుకెళ్లింది. అయితే డ్రైవర్ క్షేమంగా బయట పడ్డా.. ఈ సంఘట చూసి డ్రైవర్ కూడా భయంతో పరుగులు తీశాడు. అటుగా వస్తున్న ఆ ఇద్దరు వ్యక్తులు కూడా ప్రమాదం గమనించి పక్కకు జరిగి ప్రాణాలు కాపాడుకున్నారట. ఈ వీడియో ఎక్కడ, ఎప్పుడు జరిగిందనేదీ స్పష్టంగా తెలియరాలేదు. మొత్తానికి మాత్రం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.
शरीर का त्याग करके आत्मा निकल गई #FunKiBaat pic.twitter.com/Iry5vmQNRc
— Ashok Kumar ◆ (@ashokism) September 13, 2021