“ప్రేమకు హద్దులు ఉండవు, ప్రేమకు ఉన్న శక్తి ముందు మరేది సరిపోదు” అని చాలా మంది ప్రేమికులు చెప్పేమాట. అలానే ఓ జంట.. సమాజం అంగీకరించకున్న ఎదిరించి ఒక్కటైనారు. కానీ అందరిలాంటి ప్రేమికులు కాదు వీళ్లు. ఆమె అతడిలా, అతడు ఆమెలా మారిన ట్రాన్స్ జెండర్లు. వేద మంత్రాల సాక్షిగా ప్రేమికుల దినోత్సవం నాడే మూడు ముళ్లతో ఒక్కటయ్యారు ఈ ప్రేమికులు. ఈ ఘటన కేరళలో జరిగింది.
వివరాల్లోకి వెళ్తే.. కేరళలోని త్రిస్సూర్ కు చెందిన మనూ కార్తీక్ ఓ ఐటీ సంస్థలో సాఫ్ట్ వేర్ గా పని చేస్తున్నాడు. సోషల్ జస్టిస్ డిపార్ట్ మెంట్ లో ఉద్యోగం చేస్తుంది శ్యామా ప్రభ అనే ట్రాన్స్ జెండర్. వీరిద్దరు 2010లో క్వీర్ ఉద్యయం సందర్భంగా కలుసుకున్నారు. అప్పటి నుంచి వీరిద్దరి మధ్య మంచి స్నేహం ఏర్పడింది. అది కాస్తా ప్రేమగా మారింది. శ్యామ ట్రాన్స్ జెండర్ అని తెలిసిన ఆమెను ప్రేమించాడు మను, 2017లో మొదట మనూనే శ్యామకు లవ్ ప్రపోజ్ చేశాడట.. వీళ్ల శరీర తత్వాల గురించి తెలిసిన పెద్దలు.. వీళ్ల ప్రేమ పెళ్లికి అడ్డు చెప్పలేదు. కానీ చుట్టు పక్కలవారు వీరిని వింతగా చూశారు. వారిద్దరు సమాజం కంటే తమ ప్రేమే ముఖ్యమని భావించారు.కొన్ని వ్యక్తిగత సమస్యల కారణంగా ఇంతకాలం పెళ్లిని వాయిదా వేసిన వాళ్లు. ఇప్పుడు సంప్రదాయ బద్ధంగా పెద్దల సమక్షంలోనే ఘనంగా వివాహం చేసుకున్నారు. ఈ పెళ్లి గురించి ముందుగా ప్రచారం జరగడంతో ట్రాన్స్ జెండర్లు సైతం హాజరై.. ఈ జంటను ఆశీర్వదించి వెళ్లారు. ఇంత చేసిన వీరి వివాహం చట్టబద్ధం కాదు. అందుకే వాళ్లు తమ వివాహాన్ని చట్టబద్ధం చేసుకునేందుకు కేరళ హైకోర్టులో పిటిషన్ వేసేందుకు సిద్ధమయ్యారు. మరి.. ఈ ప్రేమజంటపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.