ప్రతి ఒక్కరి జీవితంలో పెళ్లి అనేది ఓ మధురానుభూతి. ఆ తరువాత జరిగే కార్యక్రమాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పెళ్లి అనంతరం నవ దంపతులకు మరో తంతు జరుగుతుంది. అయితే కొంత మంది పెళ్లికొడుకు ఈ కార్యక్రమంలో అత్యుత్సాహం ప్రదర్శిస్తారు. భార్యను సుఖ పెట్టాలని వింత ప్రయత్నలు చేస్తుంటారు. తాజాగా ఓ కొత్తపెళ్లి కొడుకు మొదటి రాత్రి చేసిన పనికి ఆస్పత్రి పాలయ్యాడు. ఇప్పుడు ఆ యువకుడి భవిష్యతు అగమ్యగోచరంగా మారింది. కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊడిపోయిందన్నట్లుగా అయింది ఆ వరుడి పరిస్థితి.
ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగరాజ్ కు చెందిన ఓ యువకుడికి నెల రోజుల క్రితం వివాహమైంది. వివాహం అనంతరం ఓ కార్యక్రమంలో భార్యను ఎలా బాగా సుఖ పెట్టాలని స్నేహితులను సలహా అడిగాడు. భార్యను ఎక్కువ సేపు సుఖ పెట్టాలంటే మందులు వాడాలనే స్నేహితుల మాటలు నమ్మాడు. ఆ తంతు రోజును నుంచి మందులు వాడటం మొదలుపెట్టాడు. ఇదేదో బాగుందని డోసు పెంచుకుంటూ పోయాడు. రోజుకు 50 మి. గ్రా. నుంచి 200 మి.గ్రా.. వేసుకుంటూ ఏకంగా ఇరవై రోజులు అలా వాడాడు. ఈ క్రమంలో మాత్రలు రియాక్షన్ ఇచ్చి ఆ యువకుడిలో ఆరోగ్య సమస్యలు తలెత్తాయి.
ఇదీ చదవండి: యువకుడి కిరాతకం.. యువతి ప్రేమించట్లేదని మరీ ఇంత నీచమా?ఈ మాత్రల వినియోగం వలన పురుషాంగం నిలబడే ఉండటంతో ఆస్పత్రికి వెళ్లాడు. అక్కడ వైద్య పరీక్షలు చేయించుకోవడంతో అసలు విషయం బయటపడింది. మందుల వాడడంతోనే రియాక్షన్ అయిందని వైద్యులు గుర్తించారు. ఇతడి దెబ్బకు భార్య కూడా వేగలేక పుట్టింటికి వెళ్లిపోయింది. తెలిసి తెలియక చేసిన పొరపాటు అతడి జీవితానికి తలకిందులు చేసింది. ఆపరేషన్ చేసి అంతా సరిచేస్తామని వైద్యులు సూచిస్తున్నారు. ఇక భార్య కూడా అతని వద్దకు రానని తెగేసి చెప్పిందంటా. మరి.. ఈఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.