నేటికాలంలోఅన్యాయమే రాజ్యం ఏలుతుందని, న్యాయంగా ఉండే వారికి కాలంలేదంటూ కొందరు ఆగ్రహం వ్యక్తం చేస్తుంటారు. అందుకు తగినట్లే కొన్ని దారుణమైన ఘటనలు మనం చూస్తున్నాము. తప్పు చేసిన వాడే.. గట్టిగా వాదిస్తూ తాను చేసిందే కరెక్ట్ అన్నట్లు ప్రవర్తిస్తాడు. తాజాగా ఓ పేద వ్యక్తి.. తనకు న్యాయంగా రావాల్సిన జీతం అడగమే నేరమైంది. తనకు ఇవ్వాల్సిన జీతం అడిగినందుకు ఓ యజమాని ఉద్యోగి పై దాడి చేశాడు. ఇనుపరాడ్డు తీసుకుని ఉద్యోగిపై సదరు యజమాని విరుచుకపడ్డాడు. ఈ ఘటన త్రిపుర రాష్ట్రంలోని అగర్తలాలో చోటుచేసుకుంది. ప్రసుత్తం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్అవుతోంది. ఇక ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే..
త్రిపుర రాష్ట్రం అగర్తలాలోని మఫీ అనే వస్త్ర దుకాణంలో సూరజిత్ అనే వ్యక్తి పనిచేస్తున్నాడు. ఆ దుకాణ ఓనర్ అయిన సాహు..అక్టోబర్ నెలకు సంబంధించిన జీతం సూరజిత్ కు ఇవ్వలేదు. దీంతో సూరజిత్ తనకు జీతం కావాలని అడిగాడు. రెండు,మూడు రోజులు ఎదురు చూసిన సదరు దుకాణ యజమాని సురజిత్ కి జీతం ఇవ్వలేదు. దీంతో మరొకసారి తన సాలరీ ఇవ్వాలని సూరజీత్ సాహును అడిగాడు. అయితే సూరజిత్ కావాలనే ఆ జీతం అడుగుతున్నాడని సాహు భావించాడు. ఈ క్రమంలోనే విచక్షణ కోల్పోయిన సాహు..సూరజీత్ పై విరుచుకపడ్డాడు. ఇనుపరాడ్డుతో కొడుతూ సూరజిత్ పై దాడి చేశాడు. బాధితుడు ఆ ఇనుప రాడ్డును పట్టుకోవడంతో సాహు..చేతులతో అతడి ముఖంపై పిడిగుద్దులు వర్షం కురిపించాడు. ఈక్రమంలో తనను కొట్టవద్దంటూ బాధితుడు వేడుకున్నాడు. అయినా మరొక వ్యక్తి సాయంతో మరింత దారుణం సాహూ..బాధితుడిపై దాడి చేశాడు.
ఈ దృశ్యాలు షాపులో ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డు అవ్వడంతో బయటకు వచ్చాయి. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈఘటనపై బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇక ఈ వీడియోను ప్రద్యోత్ మానిక్యా అనే రాజకీయ నాయకుడు తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేశారు. అంతేకాక ఆ దుకాణ యజమాని తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. అంతే కాక సదరు వ్యక్తిపై చర్యలు తీసుకుని బాధితుడికి న్యాయం చేయాలని ఆయన కోరారు. ఈ మధ్యకాలంలో ఇలాంటి ఘటనలు బాగా పెరిగిపోయాయి. చిన్న చిన్న విషయాలకు తమ కింద వారిపై దాడులకు దిగుతున్నారు. త్రిపురాలో జరిగిన ఈ ఘటన ప్రస్తుం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దుకాణ యజమానిపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తంచ చేస్తున్నారు.
Attention @Tripura_Police ! @YTFTIPRA have already taken up this matter with you ! We demand justice ! It breaks my heart to see treatment like this given to anyone ! Kindly Take action or I will personally come down to your station with my YTF warriors ! pic.twitter.com/ysOiiiSY5o
— Pradyot_Tripura (@PradyotManikya) November 8, 2022