ఉన్నత చదువులు చదివి, మంచి హోదా కలిగిన ఉద్యోగాల్లో పని చేసి రాజకీయాల్లోకి వచ్చిన వారు చాలా మంది ఉన్నారు. ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు, ఇంజనీర్లు, డాక్టర్లు ఇలా చాలామంది రాజకీయాల్లోకి వచ్చి తమ సత్తా చాటారు. అలాంటి వారిలో త్రిపుర ముఖ్యమంత్రి డాక్టర్ మానిక్ సాహా ఒకరు. ఆయన రాజకీయాల్లోకి రాకముందు త్రిపుర మెడికల్ కాలేజీలో పని చేశారు. ఓరల్ అండ్ మాక్సిలోఫేషియల్ డిపార్ట్‌మెంట్ హెడ్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తన వృత్తికి దూరమయ్యారు. అలాంటి ఆయన చాలా నెలల తర్వాత ఓ పిల్లాడికి ఆపరేషన్ చేశారు.
దవడ సంబంధ సమస్యతో బాధపడుతున్న ఓ 10 ఏళ్ల బాలుడికి ఆపరేషన్ చేశారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. త్రిపురకు చెందిన అక్షిత్ ఘోష్ అనే ఐదేళ్ల 10 ఏళ్ల పిల్లాడు ఐదవ తరగతి చదువుతున్నాడు. అక్షిత్ గత కొన్ని నెలలుగా దవడ సంబంధిత సమస్యతో బాధపడుతున్నాడు. ఇతడి సమస్య గురించి మాక్సిలోఫేషియల్ సర్జరీలో నిపుణుడైన ముఖ్యమంత్రి సాహాకు సమాచారం అందింది. దీంతో ఆయనే నేరుగా రంగంలోకి దిగారు. అక్షిత్‌కు ఆపరేషన్ చేశారు. చాలా నెలల తర్వాత ఆపరేషన్ చేస్తున్నప్పటికి ఆయన ఏమాత్రం తొణకలేదు. ఆపరేషన్ సక్సెస్ అయింది. శుక్రవారం అక్షిత్ ఆసుపత్రినుంచి డిశ్చార్జ్ అయ్యే అవకాశం ఉంది. ఇక, ఈ ఆపరేషన్‌పై ముఖ్యమంత్రి సాహా మాట్లాడుతూ.. ‘‘ నాకు పెద్దగా తేడా ఏదీ అనిపించలేదు.
నేను చాలా ఏళ్లుగా త్రిపుర మెడికల్ కాలేజీలో ఆపరేషన్లు చేస్తున్నట్లుగానే అనిపించింది. చాలా గ్యాప్ తర్వాత ఆపరేషన్ చేస్తున్నా.. నా చేతులు వణకలేదని నా ఫ్రెండ్స్ చెబుతూ ఉన్నారు’’ అని పేర్కొన్నారు. పిల్లాడికి ఆపరేషన్ చేయటానికి నేరుగా రాష్ట్ర ముఖ్యమంత్రి రంగంలోకి దిగటంపై సాధారణ జనం సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి ముఖ్యమంత్రి ఉన్నందుకు ఎంతో గర్వంగా ఉందని అంటున్నారు. మరి, 10 ఏళ్ల బాలుడికి ఆపరేషన్ చేసిన త్రిపుర రాష్ట్ర ముఖ్యమంత్రి సాహా గొప్ప మనసుపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
#Tripura | Speaking to media after the procedure, CM @DrManikSaha2 said he did not face much difficulty even though he was in the OT after a long time.#eastStory #NorthEastIndia https://t.co/5XkXJYCfTq
— EastMojo (@EastMojo) January 11, 2023