ఉపాధ్యాయ వృత్తికి ఓ లెక్కల మాస్టారు మాయని మచ్చ తెచ్చాడు. 8వ తరగతి బాలికను ఐ లవ్ యూ చెప్పాలని కోరినట్లు తెలుస్తుంది. దీనిపై స్పందించిన అధికారులు లెక్కల మాస్టారుకు ఊహించని షాకిచ్చారు. తాజాగా ఈ ఘటన ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది.
చదువు చెప్పే గురువును చాలామంది దైవంగా భావిస్తారు. అయితే కొంతమంది గురువులు మాత్రం ఇటీవల కాలంలో ఊహించని దారుణాలకు పాల్పడుతున్నారు. విద్యార్థినిలను లైంగికంగా వేధిస్తూ ఉపాధ్యాయ వృత్తికి మచ్చ తెస్తున్నారు. ఇలాంటి ఘటనలు ఈ మధ్యకాలంలో చాలా జరుగుతూనే ఉన్నాయి. అచ్చం ఇలాంటి ఘటనలోనే ఓ లెక్కల మాస్టారు.. విద్యార్థినిని ఐలవ్ యూ చెప్పమని కోరాడు. దీనిపై స్పందించిన ఉన్నతాధికారులు మాస్టారకు దిమ్మతిరిగే షాకిచ్చారు. ఇటీవల చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అసలేం జరిగిందంటే?
గుజరాత్ రాజ్ కోట్ జిల్లాలోని ఓ స్కూల్ లో బాలముకుంద్ అనే వ్యక్తి మ్యాథ్స్ టీచర్ గా పని చేస్తున్నాడు. అయితే ఈ మాస్టారు ఇటీవల క్లాసు రూమ్ లోని విద్యార్థుల సమక్షంలోనే ఓ 8వ తరగతి విద్యార్థినిని ఐ లవ్ యూ చెప్పాలని కోరినట్లు సమాచారం. దీనికి ఆ విద్యార్థి నో చెప్పినట్లు తెలుస్తుంది. అయితే ఇదే విషయాన్ని ఆ బాలిక వెంటనే తల్లిదండ్రులకు వివరించింది. ఇక కోపంతో ఊగిపోయిన ఆ బాలిక తల్లిదండ్రులు మ్యాథ్స్ టీచర్ తీరుపై స్కూల్ ప్రిన్సిపాల్ కు ఫిర్యాదు చేశారు. అనంతరం ఈ ఘటనపై జిల్లా విద్యా శాఖ అధికారులు సైతం స్పందించారు.
వెంటనే స్కూల్ కు చేరుకుని క్లాసులో ఉన్న సీసీ కెమెరాలను పరిశీలించారు. ఆ తర్వాత అధికారులు అన్ని కోణాల్లో విచారించారు. ఇక అనంతరం ఆ విద్యార్థిని తల్లిదండ్రులను సంతృప్తి పరచడానికి ఆ లెక్కల మాస్టారును ఉద్యోగం నుంచి బర్తరఫ్ చేస్తూ అధికారులు చర్యలు తీసుకున్నారు. ఇదిలా ఉంటే.. మ్యాథ్స్ టీచర్ ఆ బాలికలను ఐ లవ్ యూ ఫార్ములా అడిగాడని, అందుకు ఆ విద్యార్థిని చెప్పలేకపోయిందని, ఇందులో లెక్కల మాస్టారు తప్పులేదని కొందరు అతనికి సపోర్టుగా నిలుస్తున్నారు. అయితే ఇప్పుడు ఇదే ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమవుతుంది. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.