నవ మాసాలు మోసి కనిపెంచిన తల్లికి ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూసుకోవాల్సిన కొందరు కొడుకులు దారుణాలకు పాల్పడుతున్నారు. అమ్మా.. అన్న మాటే మరిచి దాడులకు తెగబడుతున్నారు. గతంలో ఇలాంటి ఘటనలు మనం అనేకం చూశాం. అయితే అచ్చం ఇలాగే బరితెగించిన ఓ కొడుకు భార్యతో కలిసి తల్లిపై దారుణానికి పాల్పడ్డాడు. ఇటీవల వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. అసలు ఈ ఘటన ఎక్కడ జరిగిందనే పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
ఈ సృష్టిలో తల్లిని మించిన యోదులు ఎవరు లేరని ఓ సినిమాలో డైలాగ్ కూడా ఉంది. పెరిగి పెద్దవారైన నా కొడుకులు ప్రయోజకులైతే చాలని ప్రతీ తల్లి అనుకుంటుంది. కానీ.. కొందరు దుర్మార్గులు మాత్రం ఏమి ఆశించని ఆ మాతృమూర్తి పట్ల దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నారు. కనిపెంచిన తల్లి అన్న కనికరం మరిచి ఊహించని దారుణాలకు తెగ బడుతున్నారు. అచ్చం ఇలాగే రెచ్చిపోయిన ఓ వ్యక్తి తన భార్యతో కలిసి దగ్గరుండి తన తల్లిపై దాడి చేయించాడు. ఇంతటితో ఆగక నడి రోడ్డుపై అందరూ చూస్తుండగా.. ఆ వృద్దురాలి కొడలు కూడా అత్తపై కోపంతో జుట్టుపట్టి పిడుగుద్దులతో దాడి చేసింది.
ఆ వృద్ధురాలిపై వారిద్దరూ దాడి చేస్తుండగా కొందరు వ్యక్తులు వీడియోలు తీసుకున్నారు. ఆ తర్వాత అదే వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఆ వీడియో కాస్త వైరల్ గా మారుతోంది. ఈ వీడియోను చూసిన చాలా మంది నెటిజన్స్ కొడుకు, కోడలి తీరుపై మండిపడుతున్నారు. కన్న తల్లిని పట్టుకుని తల్లిపై దారుణానికి దిగిన ఆ వ్యక్తిని, అతని భార్యను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇదే ఘటన ఉత్తర్ ప్రదేశ్ లలిత్ పూర్ చోటు చేసుకుంది. ఈ వీడియోలో వృద్ధురాలిపై దాడి చేస్తున్న కొడుకు, కోడలి తీరుకి ఎలాంటి శిక్ష విధించాలి? మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.
— Hardin (@hardintessa143) January 11, 2023