సాధారణంగా విషం లేని అతి పెద్ద పాము కొండ చిలువ. పెద్ద కొండ చిలువను చూస్తే.. ఎవరికైనా ఒక్కసారే ఒళ్లు జలదరిస్తుంది. అడవుల్లో నివసించే కొండ చిలువు చిన్న చిన్న జంతువులను ఆహారంగా తీసుకుంటాయి. కొన్నిసార్లు ఇవి మనుషులపై అటాక్ చేసి మింగేసిన సంఘటనలు ఎన్నో జరిగాయి. తాజాగా కాన్పూర్ లోని ఒక యూనివర్సిటీలో పదిహేను అడుగుల కొండ చిలువ మేకను మింగేసి కదల్లేని పరిస్థితిలో ఉండటాన్ని గమనించిన స్థానికులు వెంటనే అధికారులకు విషయం తెలియజేశారు.
ఉత్తర్ ప్రదేశ్ కాన్పూర్ లోని ఒక అగ్రికల్చర్ యూనివర్సిటీలో డెయిరీ విభాగం వద్ద నివాసం ఉంటున్న కొంత మంది 15 అడుగుల కొండ చిలువను చూసి భయబ్రాంతులకు గురయ్యారు. అప్పటికే అంది ఒక మెకను మింగినట్లు కనిపిస్తుంది. అక్కడ నుంచి ఆ కొండ చిలువ మెల్లిగా డిపార్ట్ మెంట్ లోకి చొరబడింది. ఈ విషయం తెలుసుకున్న విభాగం చైర్మన్ వేద ప్రకాశ్ ఫారెస్ట్ అధికారి అనురాగ్ సింగ్ కి సమాచారం అందించారు. అది మేకను మింగడం వల్ల కడుపు లావుగా కనిపిస్తుంది.. కదలలేని పరిస్థితిలో ఉందని.. దానిని రక్షించాల్సిందిగా ఆయన ఫారెస్ట్ అధికారులను కోరారు.
సమాచారం అందుకున్న అటవీ అధికారులు అక్కడికి చేరుకొని దాదాపు గంటల పాటు శ్రమించి మొత్తానికి కొండ చిలువను సురక్షితంగా పట్టుకున్నారు. ప్రస్తుతం ఆ కొండ చిలువను జూలోని స్నేక్ హౌజ్ లో వదిలి పెట్టినట్లు అధికారులు తెలిపారు. సమాచారం తెసుకున్న తర్వాత తాము రావడానికి కొద్దిగా ఆలస్యం అయ్యిందని.. అప్పటికే చాలా మంది కొండ చిలువను చూసేందుకు ఎగబడ్డారని దీంతో ట్రాఫిక్ జామ్ అయ్యిందని వీసీ డీఆర్ సింగ్ తెలిపారు.
15 ft long python found in CSA #Kanpur,was resting after swallowing a goat
Forest team Rescued and released it in zoo. pic.twitter.com/IyXcRAn6OJ— Simer Chawla (@Simerchawla20) October 19, 2022
ఇది చదవండి: వీడియో: యువకులను బంధించి.. కర్రతో చితకబాదిన నర్సు!