బిడ్డల ప్రాణాలకు ఆపద కలిగింది అంటే తమ ప్రాణాల పోతున్నా, వారి ప్రాణాలు కాపాడటానికి ప్రయత్నిస్తారు తల్లిదండ్రులు. అది వారికి పిల్లలపై ఉన్న ప్రేమ, వాత్సల్యం. ఓ తల్లి తన ప్రాణాలను రిస్క్ లో పెట్టి తన బిడ్డను చిరుత బారి నుంచి కాపాడింది. రక్తం రుచిమరిగిన ఆ చిరుత నుంచి తన ఎనిమిదేళ్ల బిడ్డ ప్రాణాలను రక్షించింది. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని సిద్ధి జిల్లాలో చోటుచేసుకోకుంది. ఈ దాడిలో ఆమెకు తీవ్రగాయాలైనప్పటికీ, చిన్నారిని చిరుత తీసుకెళ్లకుండా ఆపే ప్రయత్నం చేసింది. ఇంతలో వీరి అరుపులు విన్న స్థానిక గ్రామ ప్రజలు సంఘటనా స్థలానికి చేరుకోవడంతో చిరుత అక్కడి నుంచి పారిపోయింది.
అటవీ శాఖ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. మధ్యప్రదేశ్ లోని సిధి జిల్లాలోని సంజయ్ టైగర్ జోన్ లో ఝరియా అనే గ్రామం ఉంది. ఈ ఝరియా గ్రామం చుట్టు దట్టమైన అడవితో కూడిన కొండలు ఉన్నాయి. ఇలాంటి గ్రామంలో శంకర్ బైగా, కిరణ్ బైగా తమ పిల్లలతో జీవిస్తున్నారు. కిరణ్ బైగా సాయంత్రం తన పిల్లలతో కలిసి చలి మంటల దగ్గర కూర్చున్నారు. కిరణ్ ఒడిలో ఓ పాప ఉండాగా , మరో ఇద్దరు పిల్లలు కూర్చున్నారు. ఇంతలో అడవిలో నుంచి వచ్చిన చిరుతపులి ఒక్కసారిగా వీరిపై దాడి చేసి.. కిరణ్ బైగా ఎనిదేళ్ల కొడుకును నోట్లో పట్టుకుని తీసుకెళ్లింది.
అప్పటికే చీకటి పడింది..బిడ్డను చిరుత అడవిలోకి తీసుకెళ్లింది. అడవిలో నుంచి బిడ్డ అరుపు వినిపిస్తున్నాయి. తట్టుకోలేని తల్లి హృదయం.. ఆ కారు చీకట్లో కూడా అడవిలోకి వెళ్లింది. అక్కడ ఓ చోట పాపను గోర్లతో చిరుత దాడి చేయబోవటం కిరణ్ బైగా చూసి దానిపై కర్రతో బెదిరించింది. చిరుత పాపను వదలి ఆమెపై దాడికి ప్రయత్నించింది. చిరుత పాపపై దాడి చేసే ప్రతి సారి ఈమె దానికి ఏదో ఒక్క ఆటకం కలిగించింది. అప్పటికే చిన్నారి చాలా తీవ్రగా గాయపడింది. కొద్దిసేపటికి స్థానిక ప్రజలు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. జనం గుమిగూడడంతో చిరుత భయపడి.., అడవిలోకి పారిపోయింది. కాగా.., ఈ ఘటనకు పై సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారుల బృందం గ్రామానికి చేరుకుంది. గాయపడిన చిన్నారిని వెంటనే చికిత్స కోసం కుస్మి ఆసుపత్రిలో చేర్చారు.
ఈ సందర్భంగా అటవీ శాఖ అధికారి అసిమ్ భూరియా మాట్లాడుతూ.. చిరుతపులి దాడిలో ఇద్దరు పిల్లలకు వెన్ను, చెంపలు, కళ్లపై తీవ్ర గాయాలయ్యాయని తెలిపారు. ప్రస్తుతం వారు కుస్మి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. తీవ్రంగా గాయపడిన చిన్నారి చికిత్సకు అయ్యే ఖర్చు మొత్తాన్ని అటవీశాఖ భరిస్తుందని అధికారి తెలిపారు. దీంతో పాటు స్థానిక జిల్లా యంత్రాంగం కూడా బాధిత కుటుంబానికి సహాయాన్ని అందించింది. మరి.. బిడ్డ ప్రాణాలను కాపాడుకోవడానికి ఈ తల్లి చేసిన సాహసంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.