ఆమె ఒక ప్రజా ప్రతినిధి.. క్యాన్సర్ తో బాధపడుతున్నప్పటికీ.. అంబులెన్స్ లో స్టెచర్ పై వచ్చి తన ఓటు వినియోగించుకున్నారు. పార్లమెంటు ఎగువ సభ అయిన రాజ్యసభలో ఖాళీగా ఉన్న 16 స్థానాలకు ఈరోజు ఎన్నికలు జరుగుతున్నాయి. మరోవైపు ఇప్పటికే 41 మంది అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇదిలా ఉంటే.. త్వరలో రాష్ట్రపతి ఎన్నికలు జరగనున్నాయి.. ఈ నేపథ్యంలో రాజ్యసభ ఎన్నికలు కీలకం కానున్నాయి. మహారాష్ట్ర బీజేపీ ఎమ్మెల్యే ముక్తా తిలక్ కొంత కాలంగా క్యాన్సర్ తో బాధపడుతున్నారు.. అయినప్పటికీ అంబులెన్స్‌లో రాజ్యసభ ఎన్నికలకు ఓటు వేయడానికి వచ్చారు. స్ట్రెచర్‌లో ఆమె తన చేతిని కట్టుతో చుట్టుకుని పోలింగ్ స్టేషన్‌లోకి కి వెళ్లి ఓటువేశారు.
ఇది కూడా చదవండి: Harish Shankar: భవదీయుడు భగత్ సింగ్ అసలు ఉంటుందా? హరీశ్ శంకర్ ఏమన్నారంటే..!
ఇక ముక్తా తిలక్ ఓటు వేయడానికి వచ్చిన సమయంలో ఆమె భర్త శైలేష్ శ్రీకాంత్ తిలక్ వెంటనే ఉన్నారు. అంతేకాదు ఓటు వేసే సమయంలో ఆమె భర్తకు కూడా హాజరవ్వొచ్చు అని ఎన్నికల సంఘం అనుమతించింది. శ్రీమతి తిలక్ పూణేలోని కస్బా అసెంబ్లీ నియోజకవర్గం నుండి మహారాష్ట్ర శాసనసభకు ఎన్నికయ్యారు. ఒక ప్రజా ప్రతినిధి అన్ని ఇబ్బందులు పడుతూ కూడా తన ఓటు వినియోగించుకోవడం పై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ విషయంపై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.