సాధారణంగా బల్లిని చూస్తేనే ఇబ్బంది పడుతూ ఉంటాం. ఇక బల్లి మీద పడింది అంటే చాలు వెంటనే స్నానం చేస్తారు.. కొంత మంది అది కీడు అని భావిస్తుంటారు. మరికొంత మంది అది ఎక్కడ తినే పదార్థాలలో పడుతుందో అని తెగ జాగ్రత్తలు తీసుకుంటుంటారు. కర్నాటక రాష్ట్రంలోని చామరాజనగర్ జిల్లా వడకెహల్లా గ్రామంలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజనం తిన్న పలువురు విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వాంతులు, కడుపునొప్పి అని చెప్పడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
మధ్యాహ్నం భోజనం వడ్డించే ‘సాంబార్’లో బల్లి ఉన్నట్టు వంట మనిషి చూశాడని, వెంటనే తినడం ఆపేయాలని విద్యార్థులను హెచ్చరించినట్టు చామరాజనగర్ జిల్లా పబ్లిక్ ఇన్‌స్ట్రక్షన్ డిప్యూటీ డైరెక్టర్ మంజునాథ్ తెలిపారు. అప్పటికే కొంత మంది విద్యార్థులు భోజనం చేయడంతో ఈ దారుణం జరిగింది. వారందరినీ సమీపంలోని హాస్పిటళ్లకు తరలించి చికిత్స అందించారు.
ఇది చదవండి : వైరల్ వీడియో: పట్టాలపై విమానం.. దూసుకొచ్చిన రైలు..
విద్యార్థులు ప్రమాదం నుంచి బయటపడ్డారని, ఇప్పుడు వారికి ఎలాంటి ఇబ్బంది లేదని చికిత్స అందిస్తున్న వైద్యులు తెలిపారు. కాగా, తల్లిదండ్రులు, పాఠశాల యాజమాన్యంతో ప్రజా బోధనా విభాగం మీటింగ్ ఏర్పాటు చేసింది. సమావేశం తర్వాత ఈ నిర్లక్ష్యంపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ నిర్లక్ష్య వ్యవహారంపై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.