ఇండియాలోని ప్రముఖ ఎయిర్ లైన్స్ సంస్థలో ఇండిగో ఒకటి. ఈ సంస్థ ప్రధాన కేంద్రం గుర్గావ్ లో ఉంది. అత్యధిక మంది ప్రయాణికులు ఉన్న సంస్థల్లో ఇండిగో ఒకటి. విమాన ప్రయాణికులకు ఇండిగో విమాన సంస్థ అదరిపోయే ఆఫర్లను ప్రకటిస్తూ ఆకట్టుకుంటుంది. అయితే అప్పుడప్పుడు ప్రయాణికులకు అదిరిపోయే షాక్ లు కూడా ఇస్తుంది. ఇటీవల ఇండిగో ఫ్లైట్‌లో ప్రయాణించిన ఒక ట్విట్టర్ యూజర్ తన టికెట్ సోషల్ మీడియాలో సరదగా పంచుకున్నాడు. అందులో క్యూట్ ఛార్జీ పేరుతో రూ.100 ఉంది. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఇండిగో ఎయిర్ లైన్స్ లో ప్రయాణించిన ఓ వ్యక్తి.. తన జర్నీ టికెట్ స్క్రీన్ షాట్ తీసి సరదాగా ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు. అందులో తెలిపిన వివరాలు నెటినజ్ల దృష్టిని ఆకర్షించాయి. అందులో సీటు, కన్వీనియన్స్, ఎయిర్‌పోర్ట్ సెక్యూరిటీ మరియు యూజర్ డెవలప్‌మెంట్ ఫీజులతో పాటు, “క్యూట్ ఫీజు” కూడా వసూలు చేసింది. క్యూట్ ఫీజు పేరిట రూ.100 వసూలు చేసింది. ఇది ఇప్పుడు అందరిని తెగ ఆకర్షించింది. సదరు వ్యక్తి ఎయిర్ టికెట్ స్క్రీన్ షాట్‌ను షేర్ చేసి.. ” నేను నా వయస్సుతో పాటు అందగా కనిపిస్తున్నాను అని నాకు తెలుసు. కానీ ఇండిగో నా అందానికి కూడా ఫీజు వసూలు చేస్తుందని అసలు ఊహించలేదు” అంటూ క్యాప్షన్ జోడించాడు. అయితే అసలు విషయం ఏమిటంటే CUTE(క్యూట్) అంటే కామన్ యూజర్ టెర్మినల్ ఎక్విప్‌మెంట్.
ఎయిర్‌పోర్ట్‌లో మెటల్ డిటెక్టర్లు, ఎస్కలేటర్లు మరియు ఇతర పరికరాలు మరియు సౌకర్యాల కోసం ప్రయాణీకులకు నుంచి ఈ రుసుము వసూలు చేస్తారు. ఇది ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా విధించే చాలా సాధారణం ఛార్జీ. అయితే సదరు ట్విట్టర్ యూజర్ పెట్టిన పోస్ట్ కు మాత్రం సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో జోక్ లు పేలాయి. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
I know I’m getting cuter with age but never thought @IndiGo6E would start charging me for it. pic.twitter.com/L7p9I3VfKX
— Shantanu (@shantanub) July 10, 2022
It is amazing how majority of the users never get sarcasm.. the larger and the important point is how much additional burden the traveler ends up paying.. and when one says that, the counter argument is who asked you to travel.. please travel by road, rail or on foot… 😁
— Ramkrishna Iyer (@KannanK51531500) July 11, 2022
No worries i can pay 100₹ if someone’s referring me cute 🙂😂😂 pain of singles. Btw why i would be charged for airport security 😂, yes I mean tick tick sound’s coming from my bag, but that’s clock 😂😂😂
— MAK✨ (@Mayankc34631496) July 11, 2022