శీతాకాలం వచ్చిందంటే చాలు.. ఉష్ణోగ్రతలు పడిపోయి.. చలి గజగజా వణికిస్తుంది. తెల్లారినా సరే.. లేవాలనిపించదు. కానీ ఆఫీసులు, స్కూల్స్, కాలేజీలకు వెళ్లే వారు లేవక తప్పదు. ఇక శీతాకాలంలో వేధించే మరో ప్రధాన సమస్య.. పొగమంచు. దట్టమైన పొగమంచు వ్యాపించి.. ఎదురుగా ఏం వస్తుందో కానరాని పరిస్థితి నెలకొంటుంది. ఇక పొగమంచు కారణంగా.. శీతాకాలంలో రోడ్డు ప్రమాదాలు కూడా ఎక్కువగా జరుగుతుంటాయి. ఇక విమనాలు వంటివి ప్రయాణించడం, టేకాఫ్, ల్యాండ్ అవ్వడం కష్టంగా ఉంటుంది. దాంతో పలు విమానాలు రద్దు అవుతుంటాయి. ఇక తాజాగా పొగమంచు కారణంగా డిప్యూటీ సీఎం ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురయ్యింది. ఆ వివరాలు..
ఈ సంఘటన హరియాణాలో చోటు చేసుకుంది. పొగమంచు కారణంగా.. ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం దుష్యంత్ సింగ్ చౌతాలా కాన్వాయ్.. రోడ్డు ప్రమాదానికి గురయ్యింది. దుష్యంత్ సింగ్ సోమవారం రాత్రి.. హిస్సార్ నుంచి సిర్సాకు ప్రయాణిస్తుండగా.. అగ్రోహా ప్రాంతంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఇక ఈ ఘటనలో దుష్యంత్ సింగ్ సురక్షింతంగా బయటపడగా.. ఒక పోలీస్ అధికారి గాయపడ్డాడు. కాన్వాయ్‌లోని ఓ వెహికల్ పొగమంచు కారణంగా.. ముందు రోడ్డు స్పష్టంగా కనిపించకపోవడంతో.. సడెన్ బ్రేక్ వేసింది. దాంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది.
ఇక ఉత్తరప్రదేశ్‌లోని గౌతమ్ బుద్ధా నగర్‌లో మంగళవాంర ఉదయం పొగమంచు కారణంగా.. ఓ బస్సు కంటైనర్‌లను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో.. ఒకరు చనిపోగా.. 10 మంది తీవ్రంగా గాయప్డడారు. ప్రస్తుతం పంజాబ్, హరియాణా, ఛండీగడ్, ఢిల్లీ, ఉత్తర రాజస్తాన్, ఉత్తరప్రదేశ్‌లో భారీగా పొగమంచు పడిందని భారత వాతావరణ శాఖ పేర్కొంది. ఫలితంగా రోడ్డు మీద ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించే పరిస్థితి లేదు. ఇక ఢిల్లీ పాలెం ప్రాంతంలో.. ఏకంగా 25 మీటర్ల దూరం వరకు ముందు ఏమున్నదో కనిపించని పరిస్థితి ఉందని.. దీని వల్ల వాహనదారులు ఇబ్బంది పడుతున్నారని అధికారులు తెలిపారు. అలానే ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో ఫాగ్ అలర్ట్ కూడా జారీ చేశారు.