ఇటీవల కాలంలో క్యాబ్ డ్రైవర్లు దురుసు ప్రవర్తన గురించి కథలు కథలుగా వార్తలు వచ్చాయి. స్పీడ్ డ్రైవింగ్, మద్యం సేవించి వాహనం నడపడం, సరైన సమాధానం చెప్పకపోవడం, బుక్ చేసుకున్న ధర కన్నా ఎక్కువ వసూలు, చెప్పిన టైమ్ కి రాకపోవడం, ప్రయాణీకుల పట్ల
ఇటీవల కాలంలో క్యాబ్ డ్రైవర్లు దురుసు ప్రవర్తన గురించి కథలు కథలుగా వార్తలు వచ్చాయి. స్పీడ్ డ్రైవింగ్, మద్యం సేవించి వాహనం నడపడం, సరైన సమాధానం చెప్పకపోవడం, బుక్ చేసుకున్న ధర కన్నా ఎక్కువ వసూలు చేయడం, ప్రయాణీకుల పట్ల దురుసుగా ప్రవర్తించడం వంటి వాటి వల్ల క్యాబ్ డ్రైవర్లు వార్తల్లో నిలుస్తూనే ఉన్నారు. అయితే ఒక్కరి వల్లక్యాబ్ డ్రైవర్లందరూ చెడ్డవాళ్లన్న నిర్ధారణకు వచ్చేస్తున్నారు. పొట్ట కూటి కోసం ఈ ఆదాయ మార్గాన్ని ఎంచుకున్న డ్రైవర్లకు ఒక్కొక్కసారి ప్రయాణీకుల వల్ల తలనొప్పులు ఎదురౌతుంటాయి. బుక్ చేసుకున్నాక చాలా సేపు వెయిటింగ్ చేయిస్తుంటారు. క్యాబ్ డ్రైవర్ తో చీప్‌గా ప్రవర్తించడం, డబ్బుల విషయంలో వాదనలు జరగుతుంటాయి. ఇలాంటి సమస్యల వల్ల కూడా క్యాబ్ డ్రైవర్సే చెడ్డ పేరు ఎదుర్కోవలసి వస్తుంది. ఇదే జరిగింది అతడి విషయంలో.
ఓ మహిళ రాత్రి 10 గంటలకు క్యాబ్ ఎక్కి.. ఉదయం 10 వరకు నగరమంతా చక్కర్లు కొట్టింది. డబ్బులు అడిగితే.. ఆన్ లైన్ పేమెంట్ చేస్తానని మొదట చెప్పింది. రూ. 2000 వేలు చెల్లించండి అనే సరికి.. అతడిపై విరుచుకు పడింది. దీంతో పోలీసులు జోక్యం చేసుకోవలసి వచ్చింది. ఈ ఘటన హర్యానాలోని గురుగ్రామ్‌లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జ్యోతి అనే మహిళ.. సోమవారం రాత్రి ఇర్షాద్ క్యాబ్ ఎక్కింది. రాత్రంతా చక్కర్లు కొట్టింది. ఉదయం 10 గంటలకు ఇర్షాద్ రూ. 2000 డబ్బులు అడిగే సరికి గొడవ పెట్టుకుంది. నకిలీ కేసులో ఇరికిస్తానంటూ బెదిరించింది. దీంతో పోలీసులు జోక్యం చేసుకోగా.. వారితో కూడా దురుసుగా ప్రవర్తించింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్ అవుతుంది. చివరకు డబ్బులు ఎగ్గొట్టి వెళ్లిపోయింది.