ప్రముఖ న్యూస్ ఛానల్ ఎడిటర్ ని పోలీసులు అరెస్ట్ చేశారు. సోషల్ మీడియాలో రెచ్చగొట్టే పోస్టులు పెట్టారన్న కారణంగా అరెస్ట్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు.
సోషల్ మీడియాలో పోస్ట్ షేర్ చేసినందుకు ప్రముఖ న్యూస్ ఛానల్ ఎడిటర్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. హర్యానాలోని నుహ్ మరియు ఇతర జిల్లాల్లో జరిగిన మత హింసకు సంబంధించి సోషల్ మీడియాలో రెచ్చగొట్టే పోస్టులను షేర్ చేసినందుకు హిందీ న్యూస్ ఛానల్ ఎడిటర్ ను గురుగ్రామ్ పోలీసులు అరెస్ట్ చేశారు. సుదర్శన్ న్యూస్ ఎడిటర్ ముఖేష్ శ్రీకుమార్.. గురుగ్రామ్ సెక్టార్ 17 వద్ద కారులో ఉండగా అరెస్ట్ చేశారు. జూలై 31న ముస్లింలు మెజారిటీగా ఉన్న నుహ్ జిల్లాలోని విశ్వహిందూ పరిషత్ రథం ఊరేగింపుపై గుంపులు జరిపిన దాడిలో ఆరుగురు చనిపోయారు. చనిపోయిన వారిలో ఒక మత గురువు, ఇద్దరు హోమ్ గార్డులు ఉన్నారు.
ఖతార్ కి చెందిన అల్ జజీరా న్యూస్ ఛానల్ ఒత్తిడి కారణంగా హిందూ కార్యకర్తలపై గురుగ్రామ్ పోలీసులు అలా ప్రవర్తించారని ముఖేష్ ట్వీట్ చేశారు. విదేశీ మీడియా సంస్థ గురుగ్రామ్ పోలీస్ కమిషనర్ కళా రామచంద్రన్ కి కాల్ చేసి మతపరమైన అల్లర్లకు సంబంధించి హిందూ కార్యకర్తలపై చర్యలు తీసుకోవాలని ఒత్తిడి చేస్తున్నట్లు ఆరోపించారు. అయితే ఆయన చేసిన ఆరోపణలు నిరాధారమైనవని, తప్పుదోవ పట్టించేవిగా ఉన్నాయని కళా రామచంద్రన్ అన్నారు. ఐటీ చట్టంలోని సంబంధిత సెక్షన్ల కింద ముఖేష్ పై కేసు నమోదు చేశారు. అయితే దీనిపై స్పందించిన సుదర్శన్ ఛానల్.. ఈ అరెస్టు ఖండించింది. ఈ విషయంలో ముఖేష్ కుమార్ కి అండగా సుదర్శన్ టీవీ ఉంటుందని.. ఈ అరెస్ట్ ను మీడియా స్వేచ్ఛపై దాడిగా పరిగణిస్తుందని ఛానల్ ట్వీట్ చేసింది.
అంతేకాదు కొన్ని ప్రశ్నలను కూడా పోలీసులకు సంధించారు. యూనిఫారంలో ఉన్న ముఖేష్ ని ఎందుకు అరెస్ట్ చేయలేదని.. ఒక అధికారి అహంకారానికి హర్యానా ప్రభుత్వం తలొగ్గిందా అని.. జర్నలిస్టులు, మానవ హక్కుల సంస్థలు ఎక్కడ ఉన్నాయంటూ చవాన్కే ట్వీట్ చేశారు. ముఖేష్ ని విడుదల చేయకపోతే శనివారం పెద్ద ప్రకటన చేస్తామని గురుగ్రామ్ పోలీసులను హెచ్చరించారు. ఇది జరిగిన గంట తర్వాత పోలీసులు ముఖేష్ ని విడుదల చేశారని అధికారిక ఖాతాలో ట్వీట్ చేశారు. కానీ ముఖేష్ ని విడుదల చేసినట్లు పోలీసులు అధికారికంగా చెప్పలేదు. నుహ్ జిల్లాలో ఉద్రిక్త పరిస్థితులు ఇంకా కొనసాగుతుండడంతో అక్కడ మొబైల్ ఇంటర్నెట్, ఎస్ఎంఎస్ సేవలను ఆదివారం వరకూ నిలిపి వేశారు.
गुड़गांव की पुलिस कमिश्नर को @AJENews (अल जजीरा न्यूज चैनल) से फ़ोन किया जा रहा है
हिंदुओं के खिलाफ कार्रवाई के लिए दबाव बनाया जा रहा है।
और @DC_Gurugram फोन आने के बाद इतने दबाव में आ जाती हैं कि कहीं से भी हिंदूवादी कार्यकर्ताओं को उठा ले रही है@cmohry कृपया संज्ञान लें pic.twitter.com/bIjVYfR0Di
— Mukesh Kumar (@mukeshkrd) August 8, 2023
— Gurugram Police (@gurgaonpolice) August 11, 2023
मुकेश कुमार को छोड़ा नहीं गया तो कल बड़ी घोषणा करेंगे। देखते है कौन- कौन मर्द हिंदू साथ है।
नपुंसक तो जान कर भी मौन हैं।
किसी अधिकारी की इतनी हिंम्मत और सभी असहाय…?
हम तो असहाय नहीं है… #ReleaseMukeshKunar— Suresh Chavhanke “Sudarshan News” (@SureshChavhanke) August 11, 2023