ఈ మద్య పెళ్లి వేడుకలు చాలా విభిన్నంగా జరుపుకుంటున్నారు. భూమిపైనే కాదు.. సముద్ర గర్భంలో, వినీలాకాశంలో చాలా వెరైటీ గా పెళ్లిళ్లు జరుపుకుంటున్నారు. తమ పెళ్లి బంధుమిత్రులకు ఎప్పటికీ గుర్తుండిపోవాలని కోరుకుంటారు. ప్రీ వెడ్డింగ్ మొదలు కొని వెడ్డింగ్ వరకు చాలా రిచ్ గా ఉండేలా చూసుకుంటున్నారు.
వివాహం అనేది ప్రతి ఒక్కరికీ జీవితంలో మర్చిపోలేని ఓ మధురానుభూతి. తమకు తెలియని కొత్త మనిషితో వివాహబంధంతో కొత్త జీవితంలోకి అడుగుపెడతారు. తమ పెళ్లి పదికాలల పాటు అందరికీ గుర్తుండిపోయేలా తమ స్థాయికి తగ్గట్టు గ్రాండ్ గా చేసుకుంటారు. ఈ మద్య కాస్త స్తోమత ఉన్నవారు వివాహ వేడుకలు వైవిద్యంగా ఉండాలని సముద్ర గర్భంలో చేసుకుంటున్నారు.. మరికొంతమంది గాల్లో తేలియాడుతూ పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. సాధారణంగా వివాహవేడుకలకు ఒక చోట నుంచి మరోచోటికి వాహనాల్లో వెళ్తుంటారు. కానీ ఓ యువకుడు కాస్త భిన్నంగా ఆలోచించి.. తన పెళ్లి అందరికీ తీపి గుర్తుగా ఉండాలని స్నేహితులు, బంధువుల కోసం ఏకంగా విమానాన్నే బుక్ చేశాడు. తాజాగా దీనికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. వివరాల్లోకి వెళితే..
భువన్ అనే కొత్త పెళ్లికొడుకు తన పెళ్లి కోసం వచ్చే బంధుమిత్రుల కోసం ఏకంగా ఒక విమానాన్నే బుక్ చేశాడు. అంతేకాదు వాళ్లతో కలిసి సరదాగా విమానంలో ప్రయాణించాడు. తన పెళ్లి అందరికీ గుర్తుండి పోయేలా ఖర్చు గురించి ఏమాత్రం ఆలోచించలేదని అంటున్నాడు పెళ్లి కొడుకు భువన్. ఇందుకు సంబంధించిన వీడియో క్లిప్‌ను కూడా షేర్ చేశారు. కెమెరాకి ఫన్నీ ఫోజులు ఇస్తూ విమానంలో తన బంధు మిత్రులతో ఫుల్ జోష్ లో కనిపించాడు. ఈ వీడియో క్లిప్ షేర్ చేసిన వారు ‘పెళ్లి ఇంటికి వెళ్తున్నాం’ అంటూ క్యాప్షన్ పెట్టారు. ఈ వీడియోలో భువన్ చేతికి మెహందీ పెట్టుకొని ఉన్నాడు. తన పెళ్లికి ఎంతో సంతోషంగా వెళ్తున్న ఆనందం భువన్ లో చూడవొచ్చు.
ఈ వీడియో ఇన్ స్ట్రాగామ్ లో షేర్ చేయగా అది కాస్త వైరల్ గా మారిపోయింది. శుబ్ వెడ్డింగ్ అనే ఇన్ స్ట్రా పేజీలో ఈ వెరైటీ వీడియోను షేర్ చేయడంతో తక్కువ సమయంలోనే విపరీతంగా వైరల్ అయ్యింది. ఇప్పటికే ఈ వీడియోకి పది లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి. మొత్తాని తన పెళ్లి వేడుకను బంధుమిత్రులతో ఎంతో ఆనంతంగా గడిపిన భువన్ వారి కోసం విమానాన్ని బుక్ చేయడం కాస్త ఖర్చుతో కూడుకున్న విషయమే అయినా.. జీవితంలో ఒక్కసారైనా ఇలాంటి ఆనందాన్ని అనుభవించాలి గురూ అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి.
ఇక ఈ వీడియో పై సోషల్ మీడియాలో రక రకాల కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు. పెళ్లి కోసం ఈ మద్య సంపన్నులు ఎంతైనా ఖర్చు చేస్తున్నారు. ఇలాంటివి కామన్ అయ్యాయని కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఓ యూజర్ మీరు డబ్బు ఉన్నవారని చెప్పకనే చెబుతున్నారని కామెంట్ చేస్తే.. జీవితంలో ఇంత డబ్బు సంపాదిస్తే చాలు.. జీవితం ధన్యం అంటూ ఒకరు కామెంట్ చేశారు. ఏది ఏమైనా పెళ్లి కొగుకు తన స్నేహితులు, బంధువుల కోసం విమానం బుక్ చేయడం అనేది నిజంగా గొప్ప విషయమే అంటున్నారు మరికొంత మంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.