ఇటీవల సోషల్ మీడియాలో ఎన్నో వింతైన సంఘటనలకు సంబంధించిన వీడియోలు చక్కర్లు దర్శనమిస్తున్నాయి. జీవితంలో మనం ఎక్కడా చూడని వింతలు, విశేషాలు చూసే అవకాశం సోషల్ మీడియాలో లభిస్తున్నాయి. అయితే కొన్ని వీడియోలు ఆలోచింపజేసే విధంగా ఉంటే మరికొన్ని కడుపుబ్బా నవ్వించేవిగా.. ఆశ్చర్యాన్ని కలిగించే విధంగా ఉంటున్నాయి. వింతైన ఆకారాంలో ఉన్న జంతువులు వీడియోలు సోషల్ మీడియాలో నిత్యం హల్ చల్ చేస్తూనే ఉంటాయి. ఓ మేకపిల్ల అచ్చం మనిషి ముఖం పోలినట్టు ఉండటంతో జనాలు చూసేందుకు ఎగబడుతున్నారు. ఈ మేక పిల్లకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వింతైన ఘటన మద్యప్రదేశ్ లో చోటు చేసుకుంది.
మద్యప్రదేశ్ లో ఓ వింతైన మేకపిల్ల జన్మించింది. ఆ మేక పిల్ల ముందు నుంచి చూస్తే అచ్చం మనిషి ముఖం పోలినట్లు అనిపిస్తుంది. ఈ వింత మేక పిల్ల గురించి తెలిసిన సెమల్కేడీ గ్రామస్థులు చూసేందుకు పెద్ద ఎత్తున తరలి వెళ్తున్నారు. ఈ విషయం గురించి తెలుసుకున్న వెటర్నరీ డాక్టర్లు మాత్రం ఇలాంటి మేక పిల్లలు జన్యుపరమైన లోపాల వల్లనే జన్మిస్తుంటాయని తెలిపారు. అయితే ఈ మేకపిల్ల తల్లిపాలు తాగలేని పరిస్థితిలో ఉండటంతో సిరంజ్ తో పాలు పట్టిస్తున్నామిన వెల్లడించారు యజమాని.
గతంలో అసోం రాష్ట్రంలో ఓ మేక వింతజీవికి జన్మనిచ్చింది. ఆ జీవి అచ్చం మనిషి ముఖం పోలినట్లు ఉండటం చూసి అందరూ ఆశ్చర్యపోయారు. తలభాగం ముఖం మనిషి పోలి ఉండట.. కింది భాగం పూర్తిగా అభివృద్ది చెందకుండా రెండు కాళ్లు, చెవులతో పుట్టింది. అయితే ఆ మేక పిల్ల పుట్టిన అర్థగంటకే చనిపోయింది. జంతువులు జన్యుపరమైన లోపాలతో వింత ఆకారాలతో పుడతాయని పశు వైద్యులు అంటుంటారు. బ్రహ్మం గారు కాలజ్ఞానంలో చెప్పినట్లు భవిష్యత్ లో వింతైన జంతువులు జన్మిస్తాయని చెప్పినట్లే జరుగుతుందని అంటున్నారు నెటిజన్లు.