అది కేరళలోని కన్నూరు జిల్లా పయ్యన్నూరు గ్రామం. ఇదే గ్రామానికి చెందిన విజేష్ అనే వ్యక్తి సునీషా అమ్మాయితో ప్రేమలో పడ్డాడు. ఇక కొంతకాలానికి ఇద్దరు ప్రాణానికి ప్రాణంగా ప్రేమించుకున్నారు. ఇక పెళ్లి కూడా చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలోనే ఇరు పెద్దలను ఒప్పించి ఘనంగా పెళ్లి చేసుకున్నారు. కొన్నాళ్ల పాటు వీరి జీవితం సంతోషంగా హాయిగా కోనసాగుతూ ఉంది.
ఇక వీరి పెళ్లి జరిగి సరిగ్గా ఏడాది ముగిసింది. దీంతో ఇక్కడి నుంచి సునీషాకు అత్తింటి వేధింపులు మెల్ల మెల్లగా తలుపు తడుతున్నాయి. దీంతో అత్తింటి వారు కాదా..అని మాములుగా వదిలేసింది సునీషా. దీంతో వేధింపులు రాను రాను మరింత శృతిమించుతున్నాయి. ఇంట్లోని భర్తతో పాటు మామ, అత్త ఆ వివాహితను రోజు వేధింపులకు గురి చేస్తూ ఉండేవారు. దీంతో ఏం చేయాలో తెలియక సునీషా తనలో తాను కుమిలిపోతూ ఉండేది. కట్టుకున్న భర్త సైతం అత్తమామలకు సపోర్ట్ గా నిలవటంతో ఆమె మరింత కృంగిపోయింది.
రోజు పెట్రిగిపోతున్న అత్తింటికి వేధింపులకు సునీషా హృదయం బరువెక్కిపోతోంది. దీంతో వారి అరచాకాలను భరించలేక ఆత్మహత్య చేసుకోవాలన్ని నిర్ణయానికి వచ్చింది. అదే క్రమంలో మెట్టింటికి ఫోన్ చేసి తన సోదరుడితో మాట్లాడుతూ..నేను అత్తింటి వేధింపులకు తట్టుకోలేకపోతున్నానని..నేను రేపటి ఉదయాన్ని చూస్తానో లేదో తెలియదంటూ భావోద్వేగ పూరితంగా మాట్లాడిన ఆడియో రికార్డులు తాజాగా కలకలం రేపుతున్నాయి. ఇక తన సోదరుడితో.. భర్తతో పాటు మామ,అత్త అందరూ నన్ను చిత్రహింసలకు గురి చేస్తున్నట్లు ఆడియో కాల్ లో రికార్డ్ అయ్యాయి.
ఇక సునీషా మాట్లాడిన తీరు వింటుంటే మానవ హృదయాలను సైతం కదిలిస్తోంది. దీంతో ఆదివారం 29వ రోజున తెల్లారేసరికి సునీషా ఇంట్లో శవమై తేలింది. దీంతో కొందరు ఆత్మహత్య చేసుకుంని భావించగా, మరికొందరు మాత్రం అత్తింటివాళ్లే హత్యచేశారన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. దీంతో రగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తును వేగవంతం చేస్తున్నారు. తాజాగా జరిగిన ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది. ఇక సునీషా మరణంపై మీ అభిప్రాయలను కామెంట్ల రూపంలో మాకు తెలియజేయండి.
