దేశంలో కొత్తగా 7,145 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ బులిటెన్‌లో వెల్లడించింది. అలాగే, ఒక్కరోజులో 8,706 మంది కరోనా నుంచి కోలుకున్నారు. నిన్న దేశంలో 289 మంది కరోనా వల్ల ప్రాణాలు కోల్పోయారు. ఇక కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 569 రోజుల కనిష్ఠానికి చేరింది. ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్లలో 84,565 మంది చికిత్స తీసుకుంటున్నారు.
ఇప్పటివరకు కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 3,41,71,471కి పెరిగిందని మంత్రిత్వ శాఖ తెలిపింది. దేశంలో ఇప్పటివరకు 4,77,158 మంది ఇన్ఫెక్షన్ కారణంగా మరణించారు. ఇప్పటివరకు మొత్తం వినియోగించిన వ్యాక్సిన్ డోసుల సంఖ్య 136,66,05,173కు చేరింది. ఇక దక్షిణాఫ్రికాలో మొదలైన కరోనా వైరస్ కొత్త వేరియంట్మరోసాని ప్రపంచ వ్యాప్తంగా కుదుపేస్తోంది. ఒమిక్రాన్ రూపాంతరం చెందిన కరోనా వైరస్ పలు దేశాల్లో కలవరపెడుతోంది.
ఇదీ చదవండి : తన కూతురు ఫోటో తీయవద్దని సీరియస్ అయిన విరాట్ కోహ్లీ
తాజాగా విజృంభిస్తున్న ఒమిక్రాన్ వేరియంట్.. డెల్టా కంటే 70 రెట్లు వేగంగా వ్యాప్తి చెందుతోందని శాస్త్రవేత్తలు చెబుతుండటం ఆందోళన కలిగిస్తోంది. భారత్‌లో ఒమిక్రాన్ (Omicron) వేరియంట్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఇక, భారత్‌లోనూ ఒమిక్రాన్ కేసులు పెరిగిపోతున్నాయి. ఈ కేసులు ఇప్పటికే 111కి చేరడం మరింత ఆందోళన కలిగిస్తోంది. అయితే దేశంలో గత కొన్ని రోజులుగా కరోనా కేసులు తగ్గుముఖం పడుతూ వస్తున్నాయి. ప్రతిరోజూ పదివేల లోపే కేసులు నమోదు అవుతున్నాయి.
#Unite2FightCorona#LargestVaccineDrive#OmicronVariant
𝗖𝗢𝗩𝗜𝗗 𝗙𝗟𝗔𝗦𝗛https://t.co/y007ta57JN pic.twitter.com/mOPOgne04v
— Ministry of Health (@MoHFW_INDIA) December 18, 2021