2021 సివిల్స్ సర్వీసెస్ ఫలితాలు సోమవారం ఉదయం విడుదల అయ్యాయి. ఆల్ ఇండియా సివిల్ సర్వీసుల కోసం 685 మందిని UPSC బోర్డు ఎంపిక చేసింది. 2021 సివిల్ సర్వీసెస్ ఫలితాల్లో అమ్మాయిలు హవా చాటారు. టాప్ ఫోర్ ర్యాంకులు అమ్మాయిలే సాధించడం గమన్హారం. టాప్ ర్యాంకర్ గా శృతి శర్మ నిలిచారు. రెండో ర్యాంకును అంకిత అగర్వాల్, మూడో ర్యాంకును గామిని సింగ్లా సాధించారు.
ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ రౌండ్స్ తర్వాత యూపీఎస్సీ తుది ఫలితాలను విడుదల చేసింది.
మొత్తం 685 మందిని సివిల్ సర్వీసెస్ కు యూపీఎస్సీ ఎంపిక చేసింది. వీరిలో 244 మంది జనరల్ , 73 మంది ఈడబ్ల్యూఎస్, 203 మంది ఓబీసీ, 105 మంది ఎస్సీ, 60 మంది ఎస్టీ అభ్యర్థులు ఉన్నారు. శృతి శర్మ,అంకిత అగర్వాల్, గామిని సింగ్లా, ఐశ్వర్య వర్మ, ఉత్కర్ష్ ద్వివేది, యక్ష్ చౌదరి,సమ్యక్, ఎస్ జైన్,ఇషిత రాథీ,ప్రీతమ్ కుమార్, హర్ కీరత్ సింగ్ రంధావాలు సివిల్స్ టాప్ 10 ర్యాంకుల్లో నిలిచారు. ఇక తెలుగు రాష్ట్రాల నుంచి యశ్వంత్‌కుమార్ రెడ్డికి 15వ ర్యాంక్ సాధించారు. జాతీయ స్థాయిలో పూసపాటి సాహిత్య-24, శృతి రాజ్యలక్ష్మి-25, రవికుమార్-38,
కొప్పిశెట్టి కిర్మణయి-56, పాణిగ్రహి కార్తీక్-63, గడ్డం సుధీర్‌కుమార్-69, శైలజ-83, శివానందం 87వ ర్యాంక్, ఆకునూరి నరేష్‌కు 117వ ర్యాంక్, అరుగుల స్నేహకు 136వ ర్యాంక్, వినయ్‌కుమార్-151, దివ్యాన్షు శుక్లా-153, బొక్కా చైతన్య రెడ్డి-161, దొంతుల జీనత్ చంద్ర-201, అకవరం సాస్యరెడ్డి-214 ర్యాంకులు సాధించారు. మరి ఈసారి కూడా సివిల్స్ సర్వీస్ ఫలితాల్లో తెలుగు వాళ్లు మెరవడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: ఇనుప గొలుసులతో కొట్టుకున్న మంత్రి.. విమర్శిస్తున్న జనాలు!