‘ఒమిక్రాన్’ ప్రస్తుతం ఈ పేరు ప్రపంచాన్ని భయాందోళనకు గురి చేస్తోంది. మన దేశంలోనూ కేసులు నమోదు అవుతుండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. చాలా మంది మాస్కు ధరించేందుకు నిరాకరిస్తున్నట్లు తెలుస్తోందని కేంద్రం వెల్లడించింది. ఆ పద్ధతి మార్చుకోవాలంటూ సూచిస్తున్నారు. కరోనా నుంచి కాపేడి మాస్క్, టీకానే అని గుర్తు చేశారు. మరోవైపు ప్రపంచ దేశాల్లో ఒమిక్రాన్ వ్యాపిస్తున్న తీరు వణికిస్తోంది. ఈ విషయంపై కేంద్రం గణాంకాలను వెల్లడించింది.
2 countries had reported #Omicron cases till 24th Nov. Now 59 countries have reported cases of Omicron. These 59 countries have reported 2,936 Omicron cases. Besides this 78,054 probable cases detected- their genome sequencing is underway: Lav Agarwal, Joint Secy, Health Ministry pic.twitter.com/A4POUNAT5h
— ANI (@ANI) December 10, 2021
‘నవంబర్ 24 వరకు కేవలం రెండు దేశాల్లోనే ఒమిక్రాన్ వేరియంట్ కేసులు వెలుగు చూశాయి. ప్రస్తుతం 59 దేశాల్లో ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. 59 దేశాల్లో 2,936 ఒమిక్రాన్ వేరియంట్ కేసులు నమోదయ్యాయి. మరోవైపు 78,054 నమూనాలకు సంబంధించిన జీనోమ్ సీక్వెన్సింగ్ ఫలితాలు రావాల్సి ఉంది’ అని కేంద్రం వెల్లడించింది.
Overall positivity rate at 0.73 % in the country in last week. Less than 10,000 cases in last 14 days. Active cases highest in two states- Kerala and Maharashtra with over 43% active cases in the former & over 10% in the latter: Lav Agarwal, Joint Secy, Union Health Ministry pic.twitter.com/isogwkgBC7
— ANI (@ANI) December 10, 2021
‘దేశంలో గతవారం కరోనా పాజిటివిటీ రేటు 0.73 శాతంగా ఉందని. గత 14 రోజుల్లో 10 వేలకంటే తక్కువ కేసులు నమోదయ్యాయి. కేరళ, మహారాష్ట్రలో యాక్టివ్ కేసులు ఎక్కువున్నాయి. దేశంలో ఇప్పటివరకు 25 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. వారికి చాలా స్వల్ప లక్షణాలు మాత్రమే ఉన్నాయి. రాష్ట్రాలకు సర్వేలైన్స్, మానిటరింగ్, అంతర్జాతీయ ప్రయాణికులకు కరోనా పరీక్షలు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేయడం జరిగింది’ అంటూ కేంద్రం తెలిపింది.
WHO highlighted that public health measures should be abided by on a continual basis, besides vaccination. Adequate precautions have to be followed…Laxity in public health measures leading to a surge in cases in Europe: Lav Agarwal, Joint Secy, Union Health Ministry pic.twitter.com/6CFK8gXkZP
— ANI (@ANI) December 10, 2021
‘టీకాలు తీసుకోవడం, కరోనా నియమాలను పాటించడం అత్యంత అవసరమని WHO పదే పదే ప్రస్తావించింది. మాస్కు ధరించడానికి నిరాకరణ ఎక్కువైందని కూడా అధికారులు వెల్లడించారు. ఒమిక్రాన్ ను కట్టడి చేయాలంటే మాస్కు, టీకా, స్వీయ రక్షణే ప్రధానం’ అంటూ కేంద్రం మరోసారి హెచ్చరించింది.
#WATCH | WHO is warning against the decline in mask usage. Global scene of Omicron is disturbing…
We are now operating at a risky and unacceptable level. We have to remember that both vaccines and masks are important…: Dr VK Paul, Member-Health, NITI Aayog pic.twitter.com/kLtPb5Aa1F— ANI (@ANI) December 10, 2021