కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు ఎన్నో పథకాలు అమలు చేస్తూ వస్తుంది. సమాజంలో సేవ చేయాలనుకునే యువకుల కోసం కొత్త స్కీమ్స్ తీసుకువస్తుంది కేంద్ర ప్రభుత్వం.
కేంద్రం ఇప్పటి వరకు ఎన్నో పథకాలు అమలు చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. సాధారణంగా కొంతమంది యువతకు సమాజంలో తమ వంతు సేవా కార్యక్రమాలు చేయాలని కుతూహలం ఉంటుంది.. అలాంటి వారి కోసం కేంద్రం ఓ అద్భుతమైన స్కీమ్ ని తీసుకువచ్చింది. దానిపేరు నేషనల్ యూత్ వాలంటీర్ పథకం. ఈ పథకం ద్వారా సేవా కార్యక్రమాలు చేయడమే కాదు.. ప్రతినెల చేతికి రూ.5 వేల వరకు డబ్బులు కూడా వస్తాయి. పూర్తి వివరాల్లోకి వెళితే..
కేంద్ర ప్రభుత్వం యువత కోసం అమలు చేస్తున్న పథకాల్లో ఒకటి ‘నేషనల్ యూత్ వాలంటీర్’. ఈ పథకం ద్వారా వాలంటీర్ గా సేవా కార్యక్రమాలు చేయడమే కాదు.. ప్రతినెల రూ.5 వేల వరకు గౌరవ వేతనకం కూడా లభిస్తుంది. ఈ పథకంలో చేరిన వాలంటీర్ ని నేషనల్ యూత్ కార్ప్స్ అని పిలుస్తారు. ఇది కేంద్ర క్రీడా, యువజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధ్వర్యంలో నెహ్రూ యువ కేంద్ర సంఘటన్ పర్యవేక్షిస్తుంది. మరి ఈ పథకంలో ఎలా చేరుతారు? అర్హతలు ఏంటీ? ఎలా దరఖాస్తు చేసుకోవాలన్న విషయం గురించి పూర్తిగా తెలుసుకుందాం.
సమాజ సేవ చేయాలనే కుతూహలం ఉన్నవారు ఈ స్కీమ్ లో చేరితే గరిష్టంగా రెండు సంవత్సరాల వరకు వాలంటీర్ గా పనిచేసే అవకాశం ఉంటుంది. ఇందుకోసం గౌరవ వేతనంగా ప్రతినెల రూ.5 వేల వరకు ఇస్తారు. ప్రతి సంవత్సరం కేంద్రం 12 వేల మంది వాలంటీర్లను ఈ స్కీం కింద ఎంపిక చేస్తారు. ఎంపిక చేసిన వాలంటీర్లను ఆయా రాష్ట్రాల్లో బ్లాక్ లెవెల్ స్థాయి పంపించి అక్కడ సేవలు చేయిస్తుంది.
ఈ స్కీమ్ లో చేరడానికి 18 నుంచి 29 సంవత్సరాల వయసు ఉన్నవారు మాత్రమే అర్హులు. ఎంపికైన అభ్యర్థులకు తొలుత 4 వారాల ట్రైనింగ్ ఇస్తారు.
వాలంటీర్లుగా ఈ స్కీమ్ లో చేరాలనుకునే వారు కనీసం 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. గ్రాడ్యూయేషన్ పూర్తి చేసిన టెక్కికల్ స్కిల్స్ ఉన్నవారికి ఎంపికలో ఎక్కువగా ప్రాదాన్యత ఇస్తారు. అంతేకాదు సెల్ ఫోన్ లో పలు రయాల యాప్స్ ఉపయోగించడంలో అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యత ఉంటుంది.
నేషనల్ యూత్ వాలంటీర్ కింత వాలంటీర్ గా ఎంపిక అయిన వారు ఆయా ప్రాంతాల్లో బ్లాక్ లెవెల్ స్థాయికి తీసుకు వెళ్లి సామాజిక సేవల కోసం వినియోగించుకుంటారు నెహ్రూ యువజన కేంద్రం అధికారులు. సాధరణంగా ఒకటి లేదా రెండు మండలాలను బ్లాక్ అని పిలుస్తుంటారు. వాలంటీర్లు ఆయా బ్లాక్ కి వెళ్లి స్థానిక సమస్యలు, సామాజిక అంశాలపై ప్రజలకు అవగాహన, చైతన్యం కల్పించాల్సి ఉంటుంది. అ ప్రాంత సమస్యలపై పూర్తిగా ఒక రిపోర్ట్ తయారు చేసి అందించాల్సి ఉంటుంది.
ఇక మహిళా వాలంటీర్లు అయితే అక్కడి మహిళలను సంఘటితపరిచి, సమకాలీన అంశాలపై అవగాహన కల్పించాల్సి ఉంటుంది. కేంద్రం అమలు చేస్తున్న ప్రతి పథకం వాటి వల్ల కలిగే ప్రయోజనాల గురించి వివరించాల్సి ఉంటుంది. స్వచ్ఛభారత్ కార్యక్రమాలు నిర్వహిస్తూ.. ప్లాస్టీక్ రహిత పంచాయతీలుగా తీర్చిదిద్దాలి. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో వాలంటీర్లు ఆజాదీకా అమృత్ కాల్ అనే కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తున్నారు. ఈ స్కిమ్ కింద పంచాయతీల్లో చెరువులను అభివృద్ది చేయాల్సి ఉంటుంది.
ఈ స్కీమ్ లో చేరాలనుకునేవారు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ పథకానికి సంబంధించిన వివరాలు ఆయా జిల్లాల కలెక్టర్లు యూత్ వాలంటీర్ల నోటిఫికేషన్ ఇష్యూ చేస్తారు. అంతేకాదు దీనికి సంబంధించి ప్రముఖ దినపత్రికల్లో ప్రకటన రూపంలో ఇస్తుంటారు. దీనికి ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.
రీసెంట్ ఫోటో, అధార్ కార్డు, పదవ తరగతి మెమో, కుల ధ్రువీకరణ పత్రం, ఉన్నత విద్యార్హత సర్టిఫికెట్స్, అడ్రస్ ఫ్రూఫ్ (రేషన్ / ఓటర్ కార్డు)
నేషనల్ యూత్ వాలంటీర్ స్కీమ్ లో వాలంటీర్లను కలెక్టర్ నేతృత్వంలో ఉండే జిల్లా యువజన వ్యవహారాల అధికారి, మరో ఇద్దరు అనుభవజ్ఞులైన సభ్యులతో కూడిన కమిటీ ఉంటుంది. వారు అప్లీకేషన్లను పూర్తి స్థాయిలో పరిశీలించి వాలంటీర్లను ఎంపిక చేస్తారు.