తమిళ నటి, బిగ్‌బాస్ స్టార్ కంటెస్టెంట్ మీరా మిథున్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. కేరళలో తలదాచుకున్న మీరా మిథున్‌ను ఈరోజు సైబర్ క్రైమ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇక అరెస్ట్ అనంతరం ఆమెను పోలీసులు చెన్నైకి తీసుకువస్తున్నట్లుగా తెలుస్తోంది. గత కొన్ని రోజులుగా వివాదాస్ప వ్యాఖ్యలు చేస్తూ పోలీసులకు చుక్కలు చూపిస్తోంది మీరా మిథున్. కొంత కాలంగా దళితులపై, తమిళ సినిమాపై ఇండస్ట్రీపై వివాదాస్పద వాదనలు చిమ్ముతు వరుస వీడియోలను విడుదల చేసింది.
దీంతో ఆ వీడియోలు బాగా వైరల్ కావటంతో ఆమె ప్రవర్తనపై తమిళ నటీనటులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ఇక సినిమా ఇండస్ట్రీలోకి దళిత డైరెక్టర్స్ రావటంతోనే నాకు అవకాశాలు రాకుండా పోయాయంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది. ఇక మీరా మిథున్‌పై పోలీసులు చర్యలు తీసుకునేందుకు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. ఇక ఎక్కడున్న పోలీసుల ఎదుట విచారణకు హాజరుకావాల్సిందిగా విన్నవించారు.
దీంతో ఏం పట్టనట్లుగా వ్యవహరించి నా అరెస్ట్ జరగదు గాక జరగదు, నన్ను అరెస్ట్ చేయటం మీ వల్ల కాదంటూ ఒకవేళ అది మీకు సాధ్యమైతే అరెస్ట్ చేసుకోవచ్చు అంటూ పోలీసులకే సవాల్ విసిరింది మీరా మిథున్. దీంతో రంగంలోకి దిగిన సైబర్ క్రైమ్ పోలీసులు కేరళలో తలదాచుకున్న మీరా మిథున్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఇక మీరా మిథున్‌పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుతోపాటు మరో 7 సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి.