విశ్వాసానికి మారుపేరుగా నిలిచే కుక్కలంటే చాలామంది అమితమైన ప్రేమ చూపిస్తారు. కొంత మంది అయితే వాటిని తమ సొంత కుటుంబ సభ్యుల్లా చూసుకుంటారు. తాము పెంచుకునే పప్పీస్ కి ఏ చిన్న ఇబ్బంది వచ్చినా అల్లాడిపోతుంటారు. సాధారణంగా సీమంతం ఎవరికి చేస్తారు. గర్భిణీ స్త్రీలకు చేస్తారు. అనాధిగా సమాజంలో ఒక సంప్రదాయంగా కొనసాగుతుంది. బంధుమిత్రుల సమక్షంలో ఎంతో ఘనంగా సీమంతం చేస్తారు. ఈ మద్య మనుషులకే కాదు.. జంతువులకు కూడా శ్రీమంతం చేస్తున్నారు.
ఇటీవల పిల్లి, కుక్క,ఆవు కి సీమంతం చేసినట్లు వార్తలు వచ్చాయి. దీంతో ఈ ట్రెండ్ అన్ని జంతువులకు కొనసాగుతుంది. ఇందులో భాగంగానే పెంపుడు జంతువు గర్భం దాల్చినా ఘనంగా వేడుకలు నిర్వహిస్తారు. సీమంతం జరిపి తమ సంతోషాన్ని చాటుకుంటారు. తమిళనాడులోని సిర్కాలి ప్రాంతంలో ఇటువంటి ఘటనే వెలుగుచూసింది. నితీశ్‌కుమార్, శివరాజ్ దంపతుల పిల్లలు తమ మేనమామ ఇంటి నుంచి కుక్కపిల్లను తీసుకొచ్చి పెంచుకుంటున్నారు.
తమ పెంపుడు కుక్కకు ‘సిక్కీ’ అని పేరు పెట్టారు. ఆ కుక్క వారి ఇంటి సభ్యురాలిగా మారిపోయింది. సిక్కీ.. ప్రస్తుతం గర్భం దాల్చింది. అప్పటి నుంచి నితీశ్ కుటుంబ సభ్యులు ఎంతో అల్లారుముద్దుగా చూసుకుంటున్నారు. సొంత కూతురికి ఎంత ఘనంగా సీమంతం చేస్తారో అలా చేశారు. బంధుమిత్రులను, ఇరుగుపొరుగువారిని పిలిచి సీమంత వేడుకను ఘనంగా నిర్వహించారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.