పేదరికం అనేది ఎంత దారుణం అంటే ఎందుకు రా ఈ జన్మ అనేంతాల ఉంటుంది. కానీ.. తన వారికి పట్టెడన్నం పెట్టం కోసం ఇంటి వారే రాష్ర్టాలు, దేశాలు వలసలు వెళ్తారు. ఎందుకంటే కేవలం డబ్బు. అది ఎంత సంపాదిస్తే అంత మన వారికి కడుపు నిండా అన్నం పెట్టవచ్చు అనే భావన ఆ పేదవారిది. తాజాగా డబ్బులు ఎక్కువ వస్తాయని ఓ వ్యక్తి చెబితే నిజమని నమ్మిన ఓ కార్మికుడు అస్సాం నుంచి హైదరాబాద్‌కు వచ్చాడు. భవన నిర్మాణ పనిలో చేరిన అతడ్ని తాపీ మేస్త్రీ మోసం చేశాడు. చేతిలో డబ్బులు లేక, తినడానికి తిండి కూడా కరువయ్యింది. అయినా.. ఆ వలస కార్మికుడు కాలి నడకన తన స్వరాష్ర్టంకి పయనమయ్యాడు. ఇంతకు అతని కథ ఏమిటి, చివరికి అతను తన గమ్యం చేరాడా లేదా చూద్దాం.
అస్సాంకు చెందిన అజయ్ బోడెలే పొట్టకూటికోసం దాదాపు 2,500 కిలోమీటర్ల దూరం నుంచి హైదరాబాద్ వచ్చాడు. ఎక్కడ ఈశాన్య రాష్ట్రం అస్సాం.. ఎక్కడ హైదరాబాద్.. బ్రతకడం కోసం రాష్ర్టాలు కాదు ఖండాలు దాటి పోతుంటారు. వీరిలో కొందరు.. అక్కడ వారు చేసిన మోసలకు బలైయపోతారు. ఇక్కడ కూడా తాపీ మేస్ర్తీ అజయ్ బోడెలేకు నాలుగు రోజులు పని కల్పించాడు. కానీ.., ఆ మేస్త్రీ ఆకస్మాత్తుగా కనిపించకుండాపోయాడు. మూడు రోజులైనా ఆచూకీ తెలియలేదు. కూలీ డబ్బులు కూడా ఇవ్వకపోవడంతో తాను మోసపోయానని అజయ్ గ్రహించాడు.
అనుకోని విధంగా తాపీ మేస్త్రీ మోసం చేయడంతో తిరిగి సొంతూరుకి వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నాడు. ప్రయాణానికి చేతిలో చిల్లి గవ్వలేదు. ఇక్కడే ఉంటే మన భాష కాని బాష. రాష్ట్రం కాని రాష్ట్రం. తెలిసిన ఒక్కడు మోసం చేశాడు. ఎలా.. అయినా సొంతూరికి వెళ్లిపోవాలని అజయ్ నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలో అతడు పెద్ద సాహసానికి పూనుకున్నాడు. చేతిలో డబ్బులు లేకపోవటంతో తన వారిని ఎలాగైనా కలసుకోవాలని కాలినడకన పయనమయ్యాడు. మూడు నెలల కిందట హైదరాబాద్‌లో ప్రారంభమైన అతడి పాదయాత్ర ఇప్పటి వరకూ 650 కిలోమీటర్లు నడిచి ప్రస్తుతం ఒడిశాకు చేరాడు.దారిలో బిచ్చమెత్తుకుని కడుపు నింపుకుని, ఏమి దొరకని రోజు మంచి నీళ్లతో సరిపెట్టుకున్నాడు.
శుక్రవారం కొరాపుట్ జిల్లాలోని లక్ష్మీపుర్‌లో గువాహటికి ఎలా వెళ్లాలంటూ స్థానికులను అడుగుతున్నాడు. ఆ క్రమంలో అజయ్ బోడెలే.. నరేంద్ర అనే సామాజిక కార్యకర్త కంటబడ్డాడు. అతడి గురించి ఆరా తీయగా.. తన పేరు అజయ్ బోడులే అని, అసోంలోని నవ్‌గావ్ జిల్లాకు చెందినవాడినని చెప్పాడు. కూలీ ఎక్కువ వస్తుందని ఓ మేస్త్రీ నమ్మబలకడంతో హైదరాబాద్‌కు వచ్చి భవన నిర్మాణ పనుల్లో కార్మికుడిగా చేరానని చెప్పాడు.
తన కథ మొత్తం బోడెలే వివరించాడు. అతడి పరిస్థితిని చూచి చలించిపోయిన సామాజిక కార్యకర్త తన ఇంటికి తీసుకెళ్లి భోజనం పెట్టారు. అక్కడే రైల్వే పనుల్లో అస్సాంకి చెందిన కూలీలు వద్దకు అజయ్‌ను తీసుకెళ్లారు. వారికి విషయం వివరించడంతో అతనికి పని ఇచ్చారు. దీంతో కొద్ది రోజులు అక్కడ పనిచేయాలని, అనంతరం సొంత గ్రామానికి వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. చూశారు కదా? ఇలా నిరుపేదలను సైతం మోసం చేసే దుర్మార్గులకి ఎలాంటి శిక్ష విధించాలి? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.