గత కొంత కాలంగా దేశంలో నిత్యావసర సరుకుల ధరలు పెరిగిపోతున్నాయి. మనం నిత్యం వాడే పెట్రోల్ నుంచి కూరగాయాల వరకు అన్ని రేట్లు మండిపోతున్నాయి. రోజురోజుకు ప్రతి వస్తువు ధర పెరుగుతుండటంతో సామాన్యుడికి పెను భారం పడుతుంది. ఇప్పుడు పాల రేట్లు కూడా పెరిగాయి. లీటర్ పాలకు ఎంత పెరిగింది? ఏయే కంపెనీలు ఎంత పెంచాయో అన్న వివరాల్లోకి వెళితే..
పలు కంపెనీలు పాల రేట్లను మరోసారి పెంచారు. అమూల్, మదర్ డెయిరీ కంపెనీలు లీటర్ పాలకు 2 రూపాయలు వరకు పెంచారు. ఈ విషయాన్ని గుజరాత్ కో-ఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఒక ప్రకటన విడుదల చేసింది. గత కొంత కాలంగా పాల సేకరణ, ఇతర ఖర్చులు పెరిగిపోయిన కారణంగా ధర పెంచినట్లు డెయిరీ వెల్లడించింది.
అమూల్, మదర్ డైరీ కంపెనీలు గత మార్చి నెలలో కూడా లీటర్‌కు రెండు రూపాయల మేర పెంచారు. గోల్డ్, తాజా, శక్తి మిల్క్ కంపెనీలు సైతం లీటర్ కు రూ.2 చొప్పున పెంచుతున్నట్లు ఆగస్టు 17వ తేదీ (బుధవారం) నుంచే కొత్త ధరలు అమల్లోకి వస్తాయని వెల్లడించాయి. ఇదంతా జీఎస్టీ ఎఫెక్ట్ అంటున్నారు నిపుణులు.
ప్రస్తుతం పెరిగిన ధరల వివరాల ప్రకారం చూస్తే.. అమూల్ గోల్డ్ 500ఎంఎల్ ధర రూ.31, అమూల్ తాజా పాల ధర రూ.25, అమూల్ శక్తి పాల ధర రూ.28కి పెరిగింది. మదర్ డైరీకి చెందిన ఫుల్ క్రీమ్ మిల్క్ ధర లీటర్‌కు రూ.61గా పెంచింది. టోన్డ్ మిల్క్ ధర రూ.51, డబుల్ టోన్డ్ మిల్ ధర రూ.45కి చేరింది. టోకుగా ఇచ్చే పాల ధర రూ.48కి పెంచారు. ఇక ఆవు పాల ధర లీటరు రూ.53కి చేరింది.ఈ విషయంపై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.