ఫిల్మ్ డెస్క్- గోవాలో సర్కారు వారి పాట సినిమా టీం బాగా ఎంజాయ్ చేస్తోంది. అందులోను సూపర్ స్టార్ మహేష్ బాబు కుటుంబం, ఈ సినిమా డైరెక్టర్ వంశీ పైడిపల్లి ఫ్యామిలీ గోవాలో జాలీగా గడిపారు. సరిగ్గా పదిహేను రోజుల క్రితం హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో మహేష్ బాబు అండ్ వంశీ పైడిపల్లి ఫ్యామిలీస్ తో సహా గోవా వెళ్లారు.
గోవాలో మహేశ్ బాబు తాజా సినిమా సర్కారు వారి పాట షూటింగ్ అవుతుండటంతో పనిలో పనిగా సరదాగా గడిపినట్లు ఉంటుందని ఇరువురి కుటుంబాలు గోవాకు వెళ్లాయి. ఐతే ఫ్యామిలీ మెన్ అనిపించుకునే మహేష్ బాబు ఈ సారి గోవాలో మాత్రం ఎక్కువగా షూటింగ్‌తోనే బిజీగా గడిపారు. సితార, నమ్రత, గౌతమ్, వంశీ పైడిపల్లి ఫ్యామిలీ ఇలా అందరూ కలిసి బాగానే ఎంజాయ్ చేశారు.
కానీ గోవా వెళ్లేటప్పుడు ఫ్లైట్ లో తప్ప, గోవాలో మాత్రం మహేష్ బాబు ఎక్కడా కనిపించలేదు. ఈ విషయానికి సంబంధించి తాజాగా నమ్రత అసలు విషయం చెప్పారు. గోవాలో ఎక్కువ సమయం గడిపింది మేమిద్దరమే అని నమత్ర తన కూతురు సితారతో కలిసి దిగిన ఫోటోను షేర్ చేశారు. మమేష్ బాబు తన సర్కారు వారి పాట సినిమా షూటింగ్‌తోనే బిజీగా ఉన్నారట.
గోవాలో ఎక్కువగా కలిసి ఉంది తామిద్దరమే అని చెబుతూ షేర్ చేసిన ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరోవైపు గోవాలో ఎలా ఎంజాయ్ చేశారో చూపిస్తూ మహేశ్ బాబు కూతురు తన సితార యూట్యూబ్ చానెల్‌లో ఆద్య సితారలో ఓ వీడియోను పోస్ట్ చేయగా అది కూడా వైరల్ అవుతోంది.