ఫిల్మ్ డెస్క్- బంగార్రాజు.. అక్కినేని నాగార్జున తాజా సినిమా. ఈ మూవీలో నాగార్జున తనయుడు నాగ చైతన్య, రమ్యకృష్ణ, కృతి శెట్టి ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. సోగ్గాడే చిన్నినాయన సినిమాతో అప్పట్లో హిట్ కొట్టిన నాగార్జున, ఆ సినిమాకు కంటిన్యూయేషన్ గా బంగార్రాజు సినిమాను రూపొందించారు.
కరోెనా పరిస్థితి రోజురోజుకూ దారుణంగా మారుతున్నా కూడా నాగార్జున మాత్రం బంగార్రాజు విడుదల విషయంలో కృత నిశ్చయంతో ఉన్నారు. సంక్రాంతి పండగ సందర్బంగా జనవరి 14న ఎట్టి పరిస్థితుల్లోనూ సినిమాను విడుదల చేయాల్సిందేనని నిర్ణయించుకున్నారు. అందుకు తగ్గట్టుగానే సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ చేపట్టాడు.
బంగార్రాజు సినిమా యూనిట్ అంతా క్షణం తీరిక లేకుండా మూవీని ప్రమోట్ చేస్తోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించి అదిరిపోయే అప్డేట్ వచ్చింది. బంగార్రాజు ట్రైలర్‌ను చిత్రయూనిట్ మంగళవారం సాయంత్రం విడుదల చేసింది. ఈ ట్రైలర్ చూస్తుంటే బంగార్రాజు సినిమాలో నాగార్జున ఎంత ఎంజాయ్ చేశాడో అర్ధమవుతోంది.
ఇక నాగచైతన్య నేనేం తక్కువ తినలేదన్నట్లు బంగార్రాజు మూవీలో నాగార్జునకు మించి అనేలా ఎంజాయ్ చేసినట్టు కనిపిస్తోంది. బోకులా తయారయ్యాడు అంటూ రావు రమేష్ చెప్పే డైలాగ్ తో నాగచైతన్య కారెక్టర్ ఎలా ఉంటుందో చెప్పకనే చెప్పేశారు. మరోవైపు పల్లెటూరిలో తానే తెలివైందని, అందంగా ఉంటుందనే భ్రమలో బతికే సర్పంచ్ పాత్రలో కృతి శెట్టి ఆకట్టుకుంది.
నాగ చైతన్య, కృతి శెట్టి మధ్యలో వచ్చే సీన్స్ సుపర్బ్ అనిపిస్తున్నాయి. అటు యాక్షన్ సీక్వెన్స్‌లు సైతం బాగానే ఉన్నట్టు తెలుస్తోంది. మామిడితోటలో మాటలు అంటూ నాగ చైతన్య అనడం, ఇలాంటివి మనం ఎన్ని చేశాం అంటూ నాగార్జున అనడం.. దానికి రమ్యకృష్ణ రియాక్ట్ అవ్వడంతో ట్రైలర్ ముగుస్తుంది. బంగార్రాజు ట్రైలర్‌లో అన్ని రకాల ఎమోషన్స్ చూపించేలా కట్ చేశారు.