ఫిల్మ్ డెస్క్- టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు అమెరికా వెళ్లబోతున్నారు. దీంతో ఆయన నటిస్తున్న సినిమాల షూటింగ్ లు వాయిదా పడనున్నాయి. కనీసం రెండు నెలల తరువాతే మహేష్ బాబు మళ్లీ సినిమా షూటింగ్ లో పాల్గొననున్నారని ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం.
ఇక మహేశ్ బాబు ఓ సర్జరీ కోసం అమెరికా వెళ్లనున్నారు. గత కొన్నిరోజులుగా ఆయన మోకాలికి సంబంధించిన సమస్యతో బాధపడుతున్నారు. దీంతో శస్త్ర చికిత్స కోసం మహేశ్ అమెరికాకు వెళ్లనున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఆయన నటిస్తున్న సర్కారు వారి పాట షూటింగ్‌కు బ్రేక్ పడనుంది.
సుమారు రెండు నెలల పాటు సర్కారు వారి పాట షూటింగ్ వాయిదా పడనున్నట్లు సమాచారం. ఇక ట్విట్టర్‌లో #GETWELLSOONMAHESHBABU అనే హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అవుతుంది. తమ అభిమాన హీరో మహేశ్ త్వరగా కోలుకోవాలని కోరుతూ సోషల్ మీడియాలో ఫ్యాన్స్ ట్విట్టర్‌లో పోస్టులు చేస్తున్నారు.
మరోవైపు మహేష్ బాబు అభిమానులు కొందరు ఆయన ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అమెరికాలో తన అభిమాన హీరోకి సక్సెస్ ఫుల్ గా ఆపరేషన్ పూర్తి కావాలని, పూర్తి ఆరోగ్యంతో ఆయన తిరిగి రావాలని కోరుకుంటున్నారు. గెట్ వెల్ సూన్ మహేష్ బాబు అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.
I wish u to have Speed Recovery Annayya 🥺#GetWellSoonMaheshBabu#SarkaruVaariPaata pic.twitter.com/4hHZTuA2ps
— Maheshwar Thota 🔔 (@ThotaMaheshwar) December 1, 2021
Cinema late ina parley Anna, Ne health jagratha @urstrulyMahesh Annayya ❤️👍
మీకు ఏం కాదు అన్న మీ మంచితనం మీమల్ని ఎప్పుడు కాపాడుతుంది 💯🙏
Love you Anna 💗#GetWellSoonMaheshAnna #MaheshBabu #GetWellSoonMaheshBabu pic.twitter.com/n1TSyiOPhB
— Bharath Dhfm 🔥🦁😎 (@Bharath19774940) December 1, 2021