ఫిల్మ్ డెస్క్- సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమాలకు పండగ వచ్చేసింది. కేవలం ఒక్క పండగే కాదు, ఒకేసారి రెండు పండగలు. ఒకటి ఈ రోజు మహేష్ బాబు పుట్టిన రోజు కావడం ఆయన ఫ్యాన్స్ కు పండగైతే, ఈ సందర్బంగా సర్కారు వారి పాట సినిమా నుంచి బ్లాస్టర్ ను విడుదల చేయడం అభిమానులకు పెద్ద పండగని చెప్పాలి. మహేష్ నటిస్తున్న సర్కారు వారి పాట సినిమాపై ముందు నుంచి భారీ అంచనాలు ఉన్నాయి.
ఈ రోజు ఆగష్టు 9 మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా ఆయనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. మహేష్ బాబు తాజా సినిమా సర్కారు వారి పాట నుంచి అభిమానులకు అదిరిపోయే కానుక ఇచ్చారు మేకర్స్. సర్కారు వారి పాట మూవీ నుంచి బర్త్ డే బ్లాస్టర్ విడుదల చేశారు. వాస్తవానికి ఆగస్టు 9న మహేష్ బర్త్ డే సందర్బంగా ఉదయం 9 గంటల 9 నిమిషాలకు సర్కారు వారి పాట టీజర్ రిలీజ్ చేస్తామని చిత్ర యూనిట్ ప్రకటించింది.
కానీ అంతకంటే ముందే సర్కారు వారి పాట బ్లాస్టర్ అంటూ అర్థరాత్రి 12 గంటలకే ఈ వీడియో విడుదల చేసి అభిమానులకు సర్ ప్రైజ్ ఇచ్చారు. ఒక నిమిషం 16 సెకనుల నిడివితో ఉన్న ఈ వీడియో మహేష్ బాబు ఫ్యాన్స్ కు ఆయన బర్త్ డే గిఫ్ట్ అని వేరే చెప్పక్కర్లేదు. ఈ వీడియోలో మహేష్ బాబు ఎంట్రీ మామూలుగా లేదు.. ఇందు మూలంగా యావన్ మంది ప్రజానీకానికి తెలియజేయునది ఏమనగా.. అంటూ ఎంట్రీ ఇచ్చిన మహేష్ బాబు.. వచ్చీ రాగానే పవర్ ఫుల్ ఫైట్ చేశారు.
ఇఫ్ టైగర్ టేక్స్ రాబిట్, ఇఫ్ యూ మిస్ ద ఇంట్రస్ట్.. యువిల్ గెట్ యువర్ డేట్.. అంటూ మహేష్ చెప్పిన డైలాగ్స్ పవర్ ఫుల్ గా ఉన్నాయి. సార్ పడుకునే ముందు ప్రతి రోజూ దిష్టి తీయడం మాత్రం మర్చిపోకండి.. అంటూ మహేశ్ బాబు అందం గురించి అందాల భామ కీర్తి సురేష్ చెప్పే డైలాగ్ అదిరిపోయింది,
కీర్తి సురేష్ జడలో మల్లెపూలు చూసి మహేష్ బాబు రొమాంటిక్ యాంగిల్ బయటపెడుతూ చెప్పిన డైలాగ్ వేరే లెవల్ అని చెప్పకతప్పదు. యాక్షన్స్ సీన్స్‌కి హీరోయిన్ గ్లామర్ యాడ్ చేసి మొత్తంగా ఈ వీడియోను విజువల్ వండర్ అనేలా కట్ చేశారు డైరెక్టర్ పరశురామ్. అన్నట్లు సర్కారువారి పాట సినిమా 2022 సంక్రాతికి విడుదలవుతోంది.