హైదరాబాద్ – ఎర్రవెల్లిలోని సీఎం కేసీఆర్ ఫామ్ హౌస్‌లో యువకుడి మృతదేహం వెలుగు చూడటం కలకలం రేపుతోంది. ఆ వివరాలు.. సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం ఎర్రవల్లిలోని సీఎం కేసీఆర్ ఫామ్ హౌస్ క్షేత్రంలోకి ప్రతి రోజు చాలామంది కూలీలు పని కోసం వెళ్తుంటారు. ఈ క్రమంలోనే ఎర్రవల్లి పక్కనే ఉన్న వరద రాజాపూర్ గ్రామానికి చెందిన ఆంజనేయులు (19) అనే యువకుడు మంగళవారం ఫామ్ హౌస్‌లో కూలి పనుల కోసం వెళ్లాడు.
ఇది చదవండి: ఇక ప్రజల్లో ఉండాలని కేసీఆర్ నిర్ణయం.. జిల్లా పర్యటనలు ఖరారు
ఆంజనేయులు పని చేస్తున్న చోట ఓ బావి వద్ద చెట్ల పొదలు ఉన్నాయి. వాటిని తొలగించాల్సిందిగా అధికారులు ఆదేశించడంతో.. చెట్లను తొలగిస్తూ.. ఆంజనేయులు ఆ బావిలో జారి పడిపోయాడు. ప్రమాదం గమనించిన తోటి కూలీలు వెంటనే బావిలోకి దిగి అతడిని బయటకు తీసుకువచ్చారు. కానీ అప్పటికే ఆంజనేయులు మృతి చెందాడు. ఈ క్రమంలో ఎర్రవెల్లిలోని సీఎం కేసీఆర్ ఫామ్ హౌస్ ముందు ఆంజనేయులు కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు.
చదవండి: రైతు బంధుపై కేసీఆర్ కీలక నిర్ణయం