తమిళనాడు- సత్యరాజ్.. ఈ పేరు చెప్పగానే అందరికి గుర్తుచు వచ్చేది కట్టప్ప. అవును రాజమౌళి బాహుబలి సినిమాలో కట్టప్ప క్యారెక్టర్ చేసిన సత్యరాజ్ ప్రేక్షకుల మదిలో చిరస్థాయిగా నిలిచిపోయారు. బాహుబలి సెకండ్ పార్ట్ విడుదలయ్యే వరకు, కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపారన్న ప్రశ్న చాలా రోజులు అందరి మదిని తొలచింది.
అలా కట్టప్ప గురించి, ఆయన పాత్ర గురించి జనం చాలా కాలం చర్చించుకున్నారు. ఒక్క బాహుబలి సినిమానే కాదు, చాలా తెలుగు సినిమాల్లో సత్యరాజ్ నటించారు, ఇంకా నటిస్తూనే ఉన్నారు. ఆయన సహజ నటనతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యారు. ఇక అసలు విషయానికి వస్తే సత్యరాజ్ ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. ఆయన చెల్లెలు హఠాన్మరణం పొందారు.
దీంతో సత్యరాజ్ కుటుంబం దుఖసాగరంలో మునిగిపోయంది. తమిళనాడులోని తిరుప్పూర్ లో నివసించే సత్యరాజ్ చెల్లెలు కల్పనా మండ్రాదియార్ (66) గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. దీంతో ఆమెను కోయంబత్తూర్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్చించి చికిత్స అందిస్తున్నారు. ఈ నేపధ్యంలో శనివారం కల్న ఆరోగ్యం విషమించడంతో తుది శ్వాస విడిచారు.
సత్యరాజ్ ఫ్యామిలీలో విషాదం నెలకొంది. సత్యరాజ్ చెల్లెలు కల్పన మృతి పట్ల తమిళ సినీ పరిశ్రమలోని పలువురు దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతున్ని కోరుకున్నారు. సత్యరాజ్ కుటుంబానికి పలువురు తమ ప్రగాఢ సానుభూతిని తెలిపారు.